ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా స్టార్ హీరోయిన్ సమంత కు వాయిస్ ఇవ్వడం ద్వారా మరింత దగ్గరైంది ఈమె. పాటలతో కంటే కూడా సమాజంలో జరిగే వివాదాలను సోషల్ మీడియాలో ద్వారా లేవనెత్తడంలో మరింత ఫేమస్ అయ్యింది. ఇక ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పైన కూడా ఆమె పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ఈ క్రమంలోనే స్టార్ రైటర్ వైరముత్తు పై ఆమె సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మహిళలకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతూ మద్దతుగా నిలుస్తుంది.
అయితే జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై.. రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేసి.. తమకు న్యాయం చేయాలని కోరుతూ గత కొన్ని రోజులుగా ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి మద్దతుగా కమల్ హాసన్ ట్వీట్ చేశారు. అయితే తాజాగా చిన్మయి శ్రీపాద.. కమల్ హాసన్ ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చింది.
ఇంతకీ కమల్ ఏం ట్వీట్ చేశారంటే..
రెజ్లర్ల నిరసనలు మొదలై నేటికి నెల రోజులు. నేషనల్ గ్లోరీ కోసం పోటీపడాల్సిన వారిని వ్యక్తిగత భద్రత కోసం పోరాడే స్థితికి నెట్టివేశాం. తోటి భారతీయులారా మన అటెన్షన్‌కు అర్హులు ఎవరు? మన జాతీయ క్రీడా చిహ్నాలా లేదా విస్తృతమైన నేర చరిత్ర కలిగిన రాజకీయ నాయకులా? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
ఇప్పుడు ఎలా నమ్మాలి అంటున్న చిన్మయి..
ఇక ఈ పోస్ట్‌ను సింగర్ చిన్మయి రీట్వీట్ చేస్తూ.. మహిళలపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ప్రశ్నించినందుకు తమిళనాడు లోని ఒక సింగర్ 5 సంవత్సరాలు నిషేధించబడింది. ఇది వారి కళ్ల ముందు జరిగినా.. ఆ కవి పట్ల వారికి గౌరవం ఉంది కాబట్టి దాని గురించి ఇంత వరకు మాట్లాడలేదు. ఇలా తమ చుట్టే జరిగిన వేధింపులను పట్టించుకోకుండా ఇప్పుడు మహిళల భద్రత కోసం మాట్లాడే రాజకీయ నాయకులను ఎలా నమ్మాలి? జస్ట్ ఆస్కింగ్’ అంటూ ట్వీట్ చేసింది. అదే విధంగా ఈ ట్వీట్ కారణంగా ఇప్పుడు నా టైమ్‌లైన్‌పై ఎన్ని అసభ్య కామెంట్స్ ని చూడాలో అని రాసుకొచ్చింది. ఇక వివాదంలో పలువురు నెటిజన్లు చిన్మయికి సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు కమల్ హాసన్ కి మద్దతు ఇస్తున్నారు. చూడాలి మరి ఈ విషయంపై ఏమని స్పందిస్తారో అని..
5 years of a singer in Tamilnadu being banned for naming a molester right in front of their eyes and not a pip about it since the poettu has their respect.
— Chinmayi Sripaada (@Chinmayi) May 25, 2023
How does one trust politicians who speak for women’s safety while they ignore harassment right under their noses?
Just.… https://t.co/RLrQiuPlgT