రెడ్ మిర్చిలా ఎర్రని డ్రెస్సులో సెగలు పుట్టిస్తున్న డింపుల్ హయాతి.. హాట్ కామెంట్స్ తో రచ్చ రచ్చ..

- Advertisement -

డింపుల్ హయాతి.. ఈ అమ్మడు పేరు ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది.. నిన్న పార్కింగ్ విషయంలో చిన్నపాటి గొడవల కారణంగా క్రిమినల్ కేసు నమోదు అయ్యింది.. అది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అసలే హిట్ సినిమాలు లేవు.. ఇప్పుడు ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ అవ్వడంతో ఇక ఇండస్ట్రీలో పక్కన పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఎన్ని వచ్చిన నేను పట్టించుకోను అంటూ సోషల్ మీడియాలో సెగలు పుట్టించే విధంగా హాట్ ఫోటోలను షేర్ చేసింది.. రెడ్ మిర్చీలా రెడ్ డ్రెస్సులో ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

డింపుల్ హయాతి
డింపుల్ హయాతి

గద్దల కొండ గణేష్ చిత్రంలో ఐటెం సాంగ్ తో డింపుల్ హయతి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐటెం సాంగ్ చేసినంత మాత్రాన ఆమెపై ఐటెం బ్యూటీ అనే ముద్ర పడలేదు. కుర్రాళ్లు మెచ్చేలా హాట్ హాట్ అందాలతో ఉండడంతో దర్శకులని ఆకర్షించింది.. ఖిలాడీ, రామబాణం లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆ రెండు చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. దీనితో డింపుల్ హయతి తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇంతలో ఆమె ఓ వివాదం లో చిక్కుకుంది..డింపుల్ హయతి, ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే మధ్య వివాదం సంచలనంగా మారింది. పార్కింగ్ ప్రదేశంలో డింపుల్ హయతి.. రాహుల్ హెగ్డే కారుని కాలుతో తన్నడం, దురుసుగా ప్రవర్తించినట్లు రాహుల్ కారు డ్రైవర్ కేసు నమోదు చేయగా ఇది వివాదంగా మారింది. ఇరువురు తమ తమ వాదనలని వినిపిస్తున్నారు..

Dimple Hayathi

తాజాగా డింపుల్ హయతి తన డస్కీ అందాలతో కుర్రకారుని ఫిదా చేస్తూ రెడ్ హాట్ లుక్స్ షేర్ చేసింది. ఫ్లోర్ పై విరహంతో దొర్లుతున్నట్లుగా ఉన్న పిక్స్ నెటిజన్లని ఫిదా చేస్తున్నాయి.. రెడ్ మిర్చిలా ఎర్రని డ్రెస్సులో సెగలు పుట్టిస్తున్న డింపుల్ హయాతి చేసిన క్యాప్షన్ కూడా ట్రెండ్ అవుతుంది. నిజం వైపు నిలబడ్డప్పుడు మాత్రమే అధికారం, పరపతి ఉంటాయి. ప్రతి మహిళలో ఎరుపు తరహాలో తిరగబడే లక్షణం కూడా ఉంటుంది.. ప్రతి సారి చూస్తూ ఊరుకోదు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తున్న కామెంట్స్ చేసింది.. దీన్ని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ ఫోటోలు మాత్రం నెట్టింట వైరల్ మారాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here