తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎందుకో కొంతమంది సింగర్స్ ని చూసిన తర్వాత వీళ్లకు ఈ స్థాయి సరిపోదు, ఇంకా ఎంతో ఉన్నతమైన స్థాయి రావాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సింగర్స్ లో ఒకరు మను. ఈయన టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ పాటలకు తన గాత్రం అందించాడు, కానీ ఆ పాటల వల్ల ఈయనకి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు రాలేదు. ఇండస్ట్రీ లో ఈయన ప్రతిభ ని తెలిసిన దర్శక నిర్మాతలు ఈయనకి అద్భుతమైన ట్యూన్స్ కి పాటలు పాడే అదృష్టం అయితే ఇచ్చారు.
తద్వారా మను బాగా డబ్బులు సంపాదించుకున్నాడు కానీ, పేరు ప్రతిష్టలు మాత్రమే దక్కలేదు. ఈయన కేవలం పాటలు మాత్రమే కాదు, రజినీకాంత్ మరియు కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సినిమాలకు తెలుగు డబ్బింగ్ కూడా అందించేవాడు.రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు, అవేంటో ఒకసారి చూద్దాము.
సింగర్ మను మాట్లాడుతూ ‘నా గాత్రం SP బాలసుబ్రమణ్యం గారి గాత్రం తో దగ్గర పోలికలు ఉంటుందని నా అభిమానులు , మిత్రులు మరియు శ్రయోభిలాషులు అంటూ ఉంటారు. అది నాకు దేవుడు ఇచ్చిన వరం అని కూడా వాళ్ళు అంటుంటారు, కానీ నేను దానిని ఒక వరం లాగ భావించడం లేదు, నా గొంతు బాలసుబ్రమణ్యం గారితో పోలి ఉండడం వల్ల, నేను పాడిన ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ బాలసుబ్రమణ్యం గారే పడ్డారని అందరూ అనుకునేవారు. అవకాశాలు అయితే బాగానే వచ్చాయి కానీ, కీర్తి ప్రతిష్టలు మాత్రం రాలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు మను. కేవలం పాటలు పాడడం మాత్రమే కాదు, ఈయన పలు సినిమాల్లో ముఖ్య పాత్రలు కూడా పోషించాడు. అంతే కాకుండా బుల్లితెర మీద ప్రసారమయ్యే జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్స్ కి జడ్జి గా కూడా కొంతకాలం వ్యవహరించాడు.