స్టార్ హీరో కొడుకు కానీ కూతురు కానీ హీరో/ హీరోయిన్ అవ్వాలని రూల్ ఏమి లేదు, మనసుకి నచ్చిన పాత్రలు చేసుకోవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచింది వరలక్ష్మి శరత్ కుమార్. ప్రముఖ తమిళ హీరో శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. కెరీర్ ప్రారంభం లో ఆమె హీరోయిన్ రోల్స్ చేసింది. పలు హిట్స్ కూడా లభించాయి.
కానీ మధ్యలో ఆమెకి కొన్ని డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం తో వరలక్ష్మి శరత్ కుమార్ ని హీరోయిన్ గా పెట్టుకునేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించలేదు. దీనితో ఆమె సరైన సమయం లో సరైన నిర్ణయం తీసుకుంది. కేవలం హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా, క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ మరియు లేడీ విలన్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యి సౌత్ లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న లేడీ విలన్ గా మారిపోయింది వరలక్ష్మి శరత్ కుమార్.
ఇది ఇలా ఉండగా వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియా లో కానీ, ఇంటర్వ్యూస్ లో కానీ చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటుంది. ఆమె చేసే కొన్ని కామెంట్స్ అప్పుడప్పుడు వివాదాలకు కూడా దారి తీస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ అలాంటివే, పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ‘పెళ్లి చేసుకొని ఏమి చెయ్యాలి..?, రోజు ఒకడి మొహమే చూస్తూ ఉండాలా?
అసలు ప్రేమించుకుంటేనే పెళ్లి చేసుకోవాలి, ప్రేమించుకోకుండా చేసుకునే పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడవు, అలాంటి బలవంతపు జీవితాన్ని నేను అనుభవించలేని. నాకు భవిష్యత్తు మీద చాలా గోల్స్ ఉన్నాయి. సినిమాల నుండి రిటైర్ అయిపోయిన తర్వాత నేను రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. ఆమె చేసిన కామెంట్స్ కి సోషల్ మీడియా లో భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి.