ఆ డైరెక్టర్ నా లోదుస్తులు చూడాలని అందరిలో అడిగాడు.. స్టార్ హీరోయిన్ వైరల్ కామెంట్స్

- Advertisement -

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తనను ఒక డైరెక్టర్ లో దుస్తులన్నీ తీసేమన్నాడు అని చెప్పి అందరికీ షాకిచ్చింది. ఈమేరకు తాజాగా ఇచ్చిన ఓ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. తన కెరీర్ ప్రారంభంలో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా.. బాలీవుడ్ దర్శకుడు తన లో దుస్తులను చూడాలనుకున్నారని చెప్పింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది.

 ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా

నేను బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కొత్తలో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు సంతకం చేశాను. అందులో నాది అండర్‌కవర్‌ ఏజెంట్‌ పాత్ర. సినిమా షూట్‌ మొదలైన రెండోరోజు నాపై ఓ శృంగార సన్నివేశాన్ని చిత్రీకరించాలని దర్శకుడు భావించాడు. నా స్టైలిష్ట్‌ని పిలిచి సీన్స్‌ గురించి ఆమెకు వివరించాడు. ‘‘ఈ సీన్స్‌లో ప్రియాంక లో దుస్తుల్లోనే కనిపించాలి. అలా, కాకపోతే ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు ఎందుకు వస్తారు?’’ అని ఇబ్బందికరంగా మాట్లాడాడు. ఆయన మాటలు నా వరకూ వచ్చాయి. నాకు అవమానంగా అనిపించింది. దాంతో ఆ సినిమా నుంచి బయటకువచ్చేశాను. నిర్మాతను పిలిచి డబ్బు వెనక్కి ఇచ్చేశాను అని ప్రియాంక చెప్పింది.

Priyanka chopra

షూటింగ్ సెట్‌లో నా అండర్‌వేర్‌ని తొలగించమని అడిగిన దర్శకుడిని నేను ఏమీ అనలేదని ప్రియాంక చెప్పింది. అతనికి వ్యతిరేకంగా మాట్లాడలేదని కూడా తెలిపింది. నిరసన తెలిపేందుకు భయపడ్డానని చెప్పుకొచ్చింది. ఈ విషయంపై చాలా బాధపడినట్టుగా ప్రియాంక వెల్లడించింది.’ఆ రోజు నేను ఆ సినిమా నిర్మాత ఆఫీసు నుండి బయలుదేరాను. ఇది నిజంగా షాక్. ఆ రోజు నేను అలాంటి సంఘటనను చూశానా? అని ఇప్పటికీ అనిపిస్తుంది. మీరు చెప్పేది తప్పు అని వారికి గట్టిగా చెప్పాలి. ఆ క్షణంలో భయపడి మౌనంగా వెళ్లిపోయాను. అదే నేను చేసిన అతి పెద్ద తప్పు.’ అని ప్రియాంక తెలిపింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here