సీనియర్ నటుడు శరత్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మే 22 న పరిస్థితి విషమించడంతో ఈ లోకాన్ని వీడారు. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా చనిప్పయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శరత్ బాబు తన కెరీర్‌లో తెలుగు, తమిళం భాషల్లో మొత్తం 250 కి పైగా చిత్రాల్లో నటించాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించాడు. రామరాజ్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన శరత్ బాబు.. టాలీవుడ్‌లో అనేక చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్‌సమ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు శరత్ బాబు. ఆయన మృతిపై తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

శరత్ బాబు మృతి నేపథ్యంలో.. ఆయన అభిమానుల సందర్శనార్థం సోమవారం సాయంత్రం వరకు హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్‌లో పార్థీవ దేహాన్ని ఉంచారు. అనంతరం రాత్రి సమయంలో మృత దేహాన్ని చెన్నై తరలించారు. మంగళవారం మధ్యాహ్నం చెన్నై ఇండస్ట్రియల్ మైదానంలో సోదరుడి చేతుల మీదుగా శరత్ బాబు అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే శరత్ బాబుకు నటి రమాప్రభను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. రమాప్రభ శరత్ బాబు కంటే నాలుగేళ్లు వయసులో పెద్ద ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శరత్ బాబు. ఆ తర్వాత కూడా మరో పెళ్లి చేసుకున్నారు.. మళ్ళీ విడిపోయారు. మొత్తానికి అయితే శరత్ బాబుకు పిల్లలు లేరు అనే లోటు మాత్రం మిగిలిపోయింది.
శరత్ బాబుకు పిల్లలు లేకపోయిన తోడబుట్టిన వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. ఆయన అన్నయ్య ఉమా దీక్షితులు, తమ్ముళ్లు గోపాల్, గోవింద్, సంతోష్, మధు, మంజు ఉన్నారు. ఆయన రెండో అన్నయ్య రమా దీక్షితులు మూడు సంవత్సరాల క్రితం మృతి చెందారు అక్కాచెల్లుళ్లు సిరి, రాణి, బేబీ, మున్ని, రోజాలు. కాగా ఆయన సోదరుడు శరత్ బాబుకు తల కొరివి పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం అందుతుంది.