నటి కస్తూరి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. నాగార్జున నటించిన అన్నమయ్య సినిమాలో నటించింది.. ఆ సినిమా భారీ హిట్ ను అందుకుంది..ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. దాంతో ఈమె పేరు కూడా చాలా మంది మర్చిపోయారు.. ఇప్పుడు మళ్లీ స్టార్ మా లో ప్రసారం అవుతున్న గృహలక్ష్మీ సీరియల్ ద్వారా బాగా ఫెమస్ అయ్యింది.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన వయస్సు కూడా మరచి హాట్ ఫొటోలతో దర్శనమిస్తూ ట్రోల్స్ కు గురవుతుంది.. ఇక బుల్లితెరపై కనిపించే కొన్ని షోలలో మెరుస్తూ ఫుల్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది..
ఇక తాజాగా స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఓంకార్ షో 6th సెన్స్ కు వెళ్ళింది.. ఆ షోలో అందరు తల్లి పాత్రలు ఉన్నవారు వచ్చారు.. అందులో నటి కస్తూరి షోకు హైలెట్ అవుతుంది.. ఆమె పై ఓంకార్ హాట్ కామెంట్స్ చేశాడు.. ఇంకా అందంగా ఉన్నావు.. అస్సలు నువ్వు తల్లి అంటే ఎవ్వరు నమ్మరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ప్రస్తుతం ఈ అమ్మడుకు 49 ఏళ్లు అంటే ఎవ్వరూ నమ్మరు. నేటి హీరోయిన్లకు తీసుపోని అందం తనది. ఎప్పుడు బోల్డ్ ఫోటోలతో యువతను కాక రేపుతుంటుంది. సామాజిక కార్యకర్తగా కొన్ని విషయాలపై ప్రశ్నలు సంధిస్తుంటోంది..
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధం లేని విషయాలను కూడా పట్టించుకుంటూ అందరితో ట్రోల్స్ వేయించుకుంటుంది.. అయితే తాజాగా ఈ షోకు నటి కస్తూరి వచ్చింది. వస్తూ వస్తూనే .. ఇంట్రో కింద వేసిన వేరీ ఈజ్ ద పార్టీ అంటూ వాల్తేరు వీరయ్యలోని పాటకు స్టెప్స్ వేసింది. ఇది చూసిన యాంకర్ ఓంకార్.. ‘కస్తూరి ఓ సారి లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి.. ఏ యాంగిల్ నుండి చూసినా మదర్ లా కనిపించడం లేదు. మరదలిలా కనిపిస్తున్నారు’ అంటూ ఆమె అందానికి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అలా అనడం ఆలస్యం కస్తూరి సిగ్గుల మొగ్గైంది. ఇక బ్రహ్మముడి కనకం అయితే.. ‘ఊ అంటావా? మావా.. ఊహూ అంటావా మామా’ అంటూ ఐటమ్ సాంగ్‌తో స్టేజీని ఊపేసింది. దీంతో ఆమెనుద్దేశించి కూడా హాట్ కామెంట్స్ చేశాడు.. ఇలా షో మొత్తం ఓంకార్ ఆమెను వదల్లేదు.. ఇంకా ఎన్ని మాటలు అన్నారో మీరు ఒకసారి ఆ వీడియో ను చూడండి..