రెగ్యులర్ గా చూసే కమర్షియల్ సినిమాలకంటే హారర్ థ్రిల్లర్స్ కి మన టాలీవుడ్ లో యమక్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. హారర్ జానర్ లో ఒక చిత్రాన్ని తెరకెక్కించాలి అంటే సాధారణమైన విషయం కాదు.ఆడియన్స్ కి సరైన హారర్ థ్రిల్లింగ్ అనుభూతి రప్పించి ప్రేక్షకులను థియేటర్స్ కి క్యూ కట్టెలాగా చేసిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇలాంటి సినిమాలు కేవలం థియేటర్స్ లోనే చూడాలి, కానీ థియేటర్స్ లో మాత్రమే కాకుండా ఇంట్లో చూసిన అదే తరహా అనునుభూతి కలిగించే 5 హారర్ సినిమాలను మీకోసం చెప్తున్నాము చూడండి.
1) డిమాంటి కాలనీ :
2015 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా కూడా పెద్ద సక్సెస్ అయ్యింది. కథ విషయానికి వస్తే నలుగురు స్నేహితులు ఒక లాకెట్ కోసం హాంటెడ్ హౌస్ కి వెళ్తారు. వాళ్ళు ఆ ఇంటి నుండి వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు దెయ్యం కూడా వస్తుంది. అక్కడి నుండి వచ్చిన తర్వాత వీళ్ళ ఇంట్లో జరిగే హారర్ మూమెంట్స్ ని సినిమాగా తీశారు.రెండు గంటల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDB లో 10 కి 7 రేటింగ్స్ ఉన్నాయి. మంచి హారర్ థ్రిల్లింగ్ సన్నివేశాలు ఉన్న ఈ చిత్రం యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నది.
2 ) భూత్ కాలం :
గత ఏడాది విడుదలైన చిత్రమిది.ఇది తల్లి కొడుకుల మధ్య సాగే కథ, వీళ్ళ జీవితం సాదాసీదాగా వెళ్తున్న సమయం లో వీళ్లిద్దరి జీవితం లోకి దెయ్యం మూడవ వ్యక్తిగా ఇంట్లోకి ప్రవేశపెడుతుంది. ఆ దెయ్యం వీళ్ళ జీవితం లోకి వచ్చిన రోజు నుండి ఇద్దరికీ ప్రతీ రోజు నరకప్రాయం గా ఉంటుంది. అసలు ఎందుకు వీళ్ళ జీవితం లోకి ఆ దెయ్యం ప్రవేశించింది..?,అసలు కథ ఏమిటి అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తర్వాత ఏమి జరగబోతుంది అనే ఉత్కంఠ మొదటి నుండి చివరి వరకు ఉంటుంది. ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీ యాప్ లో అందుబాటులో ఉంది.
3) అమిష్ :
ఇది సాధారణమైన సినిమా అయితే కాదు, ఇలాంటి చిత్రాన్ని మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ చూసి ఉండరు కూడా, మనం మన జీవితం లో చికెన్ తిని ఉంటాం లేదా మటన్ తిని ఉంటాము, కానీ మనిషి మాంసం ఎప్పుడైనా తిని ఉంటామా..?, ఆలా తెలియకుండా మనిషి మాంసం తిన్న ఒక అమ్మాయి కథ ఇది. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు నరాలు తెగిపోయే రేంజ్ హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ చిత్రం సోనీ లివ్ లో అందుబాటులో ఉంది.
4 ) భిన్నా :
ఒక సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన హారర్ సినిమా ఇది, ఇందులో ఒక అమ్మాయి కలలో హారర్ మూమెంట్స్ మొత్తం నిజ జీవితం లో కూడా జరుగుతూ ఉంటాయి. అవి మనల్ని ఎంతో థ్రిల్లింగ్ కి గురి చేస్తూ ఉంటుంది. IMDB లో ఈ చిత్రానికి 7.6/10 రేటింగ్స్ వచ్చాయి. ఈ చిత్రం జీ 5 యాప్ లో అందుబాటులో ఉంది.
5 ) విరూపాక్ష :
రీసెంట్ గా సమ్మర్ లో విడుదలై బాక్స్ ఆఫీస్ ని దున్నేసిన చిత్రమిది ఇది. ఆడియన్స్ కి సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని అందించి సుమారుగా 48 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది, ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అర్జెంటు గా చూసేయండి. కథ విషయానికి వస్తే రుద్రావణం అనే ఒక ఊరిలో చిన్న పిల్లలందరూ చనిపోతూ ఉంటారు.
వాళ్ళు అలా చనిపోవడానికి కారణం ఇద్దరు దంపతులు క్షుద్ర శక్తులను ఉపయోగించి చేతబడి చెయ్యడం వల్లే అని నమ్మి , వాళ్ళని ఒక చెట్టుకి కట్టేసి సజీవ దహనం చేస్తారు. చనిపోయే ముందు భార్య వచ్చే పుష్కరానికి ఊరు వల్లకాదు అవుతుంది అంటూ శపిస్తుంది. ఆమె చెప్పినట్టుగానే పుష్కరం తర్వాత ఊరిలో వరుసగా హత్యలు జరుగుతూ వస్తాయి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అనేది చాలా థ్రిల్లింగ్ గా తీశారు డైరెక్టర్ కార్తీక్ దండు.