ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.. దర్శకుడు కొరటాల శివ దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశాడని గట్టిగా వినిపిస్తోంది. టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దేవర టైటిల్ ఫైనల్ చేశారు. అయితే ఈ టైటిల్ ని కొన్నేళ్ల క్రితమే నిర్మాత బండ్ల గణేష్ రిజిస్టర్ చేయించారు.. దేవర టైటిల్ తో పవన్ కళ్యాణ్ తో మూవీ నిర్మించాలనేది ఆయన డ్రీమ్.. అయితే ఇప్పుడు ఆ టైటిల్ ను ఎన్టీఆర్ సినిమాకు పెట్టడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు బండ్ల.. అంతేకాదు సంచలన వ్యాఖ్యలు చేశారు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బండ్ల డైహార్డ్ ఫ్యాన్ అన్న విషయం తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు.. పవన్ ని ఆరాధించే బండ్ల గణేష్ ఆయన్ని దేవర అని పిలుచుకుంటారు. ఆ టైటిల్ పవన్ కళ్యాణ్ కి బాగా సూట్ అవుతుందని ఆయన నమ్మకం.. రిజిస్టర్ అయితే చేయించాడు కానీ దాన్ని రెన్యువల్ చేయించడం మర్చిపోయాడు. దాంతో దేవర టైటిల్ ని కొరటాల శివ వాడుకోబోతున్నాడు. ఇది బండ్ల గణేష్ రిజిస్టర్ చేసుకున్న టైటిల్ అని కొద్ది రోజులుగా ప్రచారం అవుతుంది. నేడు ఆయనే బయటపడ్డారు. ఒకింత అసహనం వ్యక్తం చేశారు. నేను రిజిస్టర్ చేయించుకున్న టైటిల్. రెన్యువల్ చేయడం మర్చిపోవడంతో కొట్టేశారు… అని కామెంట్ పోస్ట్ చేశారు.
అంతేకాదు యాంగ్రీ ఏమోజీ పోస్ట్ చేశాడు. దేవర టైటిల్ ఎన్టీఆర్ చిత్రానికి వాడుకున్నందుకు బండ్ల చాలా కోపంగా ఉన్నారని వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో ఇది రెండో చిత్రం. గతంలో జనతా గ్యారేజ్ చిత్రం చేశారు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. చాలా కాలం తర్వాత మరోసారి చేతులు కలిపారు. ఎన్టీఆర్ 30లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. దాదాపు రూ 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరక్కుతుంది.. ఈ సినిమాతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కథానాయికగా ఎంట్రీ ఇవ్వనుంది.. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..