తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా కొనసాగిన హీరోలు మరియు హీరోయిన్లు గడిచిన రెండు సంవత్సరాలలో వివాహాలు చేసుకొని తమ బ్యాచిలర్ జీవితానికి టాటా చెప్పేసిన సంగతి అందరికీ తెలిసిందే.నితిన్, నిఖిల్ , రానా మరియు కాజల్ అగర్వాల్ వంటి వారు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకున్నారు.అయితే వీరితో పాటుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ముందు వరుసలో కొనసాగిన కొంతమంది సెలెబ్రిటీలు కూడా వచ్చే నెలలో ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టి పెళ్లి చేసుకోనున్నారు. వాళ్లెవరో ఒకసారి చూద్దాము.
శర్వానంద్ – రక్షిత రెడ్డి:
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడిగా కొనసాగిన శర్వానంద్ ఈ ఏడాది జనవరి నెలలో రక్షిత రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. బెంగళూరు కి చెందిన రక్షిత రెడ్డి ని శర్వానంద్ గత మూడేళ్ళ నుండి ప్రేమాయణం నడిపాడు.మొత్తానికి ఆయన తన ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పించి ఈ వివాహం చేసుకోబోతున్నాడు.వీళ్లిద్దరి పెళ్లి జూన్ 2 వ తారీఖున జరగబోతుంది.
అడవి శేష్ – సుప్రియ :
గత కొంత కాలం నుండి అడవి శేష్ మరియు సుప్రియ (అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఫేమ్) ప్రేమించుకుంటున్నారని, డేటింగ్ లో ఉన్నారని , త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియా లో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరు కలిసి గూఢచారి సినిమాలో నటించారు.ఈ చిత్రం షూటింగ్ సమయం లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టింది.వీళ్ళ నిశ్చితార్థం జూన్ నెల 16 వ తేదీన జరగబోతుందని సమాచారం.అంటే తొందర్లోనే అడవి శేష్ అక్కినేని ఫ్యామిలీ అవ్వబోతున్నారు అన్నమాట . వీళ్ళ నిశ్చితార్థం కి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి :
గత రెండు మూడేళ్ళ నుండి సోషల్ మీడియా లో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి గురించి ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.వీళ్లిద్దరు కాల్షిప్ ‘మిస్టర్’ మరియు ‘అంతరిక్షం’ వంటి సినిమాలలో నటించారు. ఈ సినిమాల షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరు ప్రేమించుకున్నారని, ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని , త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపించాయి. దానికి తోడు మెగా ఫ్యామిలీ కి సంబంధించిన ప్రతీ శుభ కార్యం లో లావణ్య త్రిపాఠి కనిపించడం తో వీళ్లిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారు అనే విషయం నిర్ధారణ అయ్యింది. వీళ్ళు కూడా వచ్చే నెలలో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.