కెరీర్ ప్రారంభం నుండి విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ మరియు గుర్తింపుని తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బిచ్చగాడు 2 ‘ నిన్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు తమిళ బాషలలో ఘనంగా విడుదలై యావరేజి టాక్ ని తెచ్చుకుంది.
ఫస్ట్ హాఫ్ కి మంచి రిపోర్ట్ రాగా, సెకండ్ హాఫ్ మాత్రం కాస్త రొటీన్ గా అనిపించింది అని టాక్ గట్టిగా వచ్చింది.అయినా కానీ ఓపెనింగ్స్ విషయం ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెట్టేలా చేసింది. ప్రమోషనల్ కంటెంట్ మరియు ట్రైలర్ పెద్దగా ఆకట్టుకునే విధంగా లేకపోయినప్పటికీ,2016 వ సంవత్సరం చిన్న సినిమాగా విడుదలై సౌత్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ‘బిచ్చగాడు’ చిత్రానికి సీక్వెల్ అవ్వడం కారణంగానే ఈ చిత్రానికి అంత గొప్పగా ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 6 కోట్ల 50 లక్షల రూపాయలకు జరిగింది. తమిళ్ వెర్షన్ కూడా కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మొదటి రోజు ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ నుండి రెండు కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ నెంబర్ లో 30 శాతం కి పైగా వసూళ్లు వచ్చాయి.
టాక్ యావరేజి గా ఉండడం తో సినిమాలు కూడా ఏమి లేనందున కచ్చితంగా ఈ చిత్రం వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ మార్కుని అవలీలగా దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరో పక్క తమిళ వెర్షన్ కి రెండు కోట్ల రూపాయిలు షేర్ వచ్చి ఉంటుందని అనుకుంటున్నారు. రాబోయే బాక్స్ ఆఫీస్ పరంగా ఇంకా ఏ రేంజ్ కి బిచ్చగాడు 2 వెళ్లబోతుందో చూడాలి.