సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో సుమారుగా నాలుగు దశాబ్దాలకు పైగా ఉంటూ హీరో గా , క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వందల సినిమాల్లో నటించిన నటుడు శరత్ బాబు. చూసేందుకు ఫారిన్ సిటిజెన్ లాగ అనిపించే శరత్ బాబు రీసెంట్ గానే అస్వస్థతతో హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం గురించి సోషల్ మీడియా లో ఎన్నో అసత్య వార్తలు ప్రచారం అయ్యాయి.
కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదని, శరత్ బాబు కోలుకుంటున్నారని అధికారికంగా కుటుంబ సభ్యులు ప్రకటించడం తో ఆయనని అభిమానించే వారు కాస్త రిలాక్స్ అయ్యారు. గత కొంత కాలం నుండి సినిమాలకు దూరం గా ఉంటూ వచ్చిన శరత్ బాబు, పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం లో ఒక ముఖ్య పాత్రని పోషించాడు.ఆ తర్వాత మళ్ళీ ఆయన ఏ సినిమాలో కూడా కనిపించలేదు.
ఇది ఇలా ఉండగా శరత్ బాబు గతం లో ఆంధ్ర ప్రదేశ్ లో తనకి ఉన్న వ్యాపారాల గురించి ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలు అప్పట్లో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఆయన మాట్లాడుతూ ‘ నాకు వ్యాపారాల మీద కానీ, సినిమాల మీద కానీ పెద్దగా ఆసక్తి ఉండేది కాదు, నాకు మొదటి నుండి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఉండేది. సెలెక్షన్స్ కి వెళ్లే సమయం లోనే నాకు సైట్ వచ్చింది. ఇక అక్కడితో పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే కలని మర్చిపోయాను.
పోలీస్ కాకపోతే సినిమాల్లో రావాలని అప్పుడే నిశ్చయించుకున్నాను. అవకాశాల కోసం బాగా కష్టపడ్డాను, కె బాలచందర్ నన్ను చూడగానే ఎంతగానో నచ్చి నాకు మొదటి సినిమాలోనే హీరో గా చేసే ఛాన్స్ ఇచ్చాడు, ఆ సినిమా అప్పట్లో వంద రోజులు ఆడింది. ఇక తండ్రి గారి తదనంతరం ఆయన వ్యాపారాలన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లో నాకు చాలా పెద్ద వ్యాపారాలు ఉన్నాయి.ఆదాయం కూడా భారీ గానే వస్తుంది’ అంటూ సమాధానం చెప్పాడు శరత్ బాబు.