చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యమైన వాటిల్లో కాస్టింగ్ కౌచ్ ఒకటి. అప్ కమింగ్ యాక్ట్రెస్ తమ కేరీర్ లో ముందుకు వెళ్లకుండా ఇది శాపంగా మారింది. ఇప్పటికీ ‘మీ టూ’ ఉద్యమంతో ఒక్కొక్క హీరోయిన్ తమకు ఎదురైన అనుభవాలను నిర్భయంగా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్, యంగ్ హీరోయిన్ దివి (Divi) కూడా కాస్టింగ్ కౌచ్ (Casting Couch)పై నోరువిప్పింది. ‘బిగ్ బాస్ తెలుగు’ (Bigg Boss Telugu) సీజన్ 4లో అవకాశం దక్కించుకుని బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ బ్యూటీ సినీ ఆఫర్లు కూడా బ్యాక్ టు బ్యాక్ అందుతున్నాయి.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ (Godfather) చిత్రంలోనూ ఓ ముఖ్య పాత్రను పోషించింది. ఈ చిత్రం తర్వాత దివిని ఓ ఛానెల్ వారు తాజాగా ఇంటర్వ్యూ చేశారు. ఆమె సినీ కేరీర్ గురించి కూడా తెలుసుకున్నారు. ఈ క్రమంలో దివికి ‘కాస్టింగ్ కౌచ్’పై ప్రశ్నలు సంధించారు. ఇండస్ట్రీలో ఇన్నేండ్లు గా ఉంటున్న మీకు ఎప్పుడైనా ఈ పరిస్థితి ఏర్పడిందా? అలాంటప్పుడు ఏం చేశారు? అని ప్రశ్నించారు.
అయితే తనకు అలాంటి సమస్య ఎదురు కాలేదని కానీ ఏ నటీకైనా తాను నడుచుకునే తీరును బట్టి ఇలా సమస్యలు ఎదురవుతాయని తెలిపింది. మొత్తానికి అయితే తాను షార్ట్ ఫిలిమ్స్, మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపింది. అయితే దివీ చెబుతున్నవి అబద్ధాలంటూ నెటిజన్లు అంటున్నారు. చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లే క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్నారు. నీకు ఎదురవ్వలేదా అని ప్రశ్నిస్తున్నారు.