అందంగా ఉండే శ్యామలా.. తన జీవితంలో ఇంత చండాలమైన తప్పు చేసిందా

- Advertisement -

శ్యామలా బుల్లి తెర‌తో పాటు సిల్వ‌ర్ స్క్రీన్‌పై కూడా మెప్పిస్తోన్న‌యాంక‌ర్ శ్యామ‌ల సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. గతంలో ఆమె రామ్ చ‌ర‌ణ్‌కు స‌పోర్ట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి చేసిన ట్వీట్ తెగ వైర‌ల్ అయ్యింది. ప్ర‌పంచం అంతా రామ్ చ‌ర‌ణ్‌ను అప్రిషియేట్ చేస్తుంటే సినిమా కులం మాత్రం ఈర్ష్య‌తో ప‌ట్ఙంచుకోవ‌టం లేదంటూ చేసిన ట్వీట్ దుమారం రేపింది. దీనిపై కొంద‌రు ఈ అవార్డ్ కేవ‌లం రామ్ చ‌ర‌ణ్‌కి మాత్ర‌మే రాలేదంటూ ఆమెకు రీట్వీట్స్ కూడా చేశారు. ఏదైతేనేం శ్యామ‌ల తీరు చూసిన వారు ఆమెను అటెన్ష‌న్ సీక‌ర్ అని అంటున్నారు.

శ్యామలా
శ్యామలా

ఈ అమ్మ‌డు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. 19 ఏళ్ల వయసులోనే నరసింహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్యామ‌ల ఇంట్లో వాళ్ల‌కి ఇష్టం లేకుండానే వివాహం చేసుకుంది. అయితే త‌మ‌ పెళ్లికి వాళ్ల‌ అమ్మ రాకపోవడం తనుకు చాలా బాధేసిందని ఆ లోటు అలాగే ఉండిపోయిందని ఒకానొక సంద‌ర్భంలో చెప్పుకొచ్చింది. రీసెంట్ గా యాంకర్ శ్యామల బ్లాక్ బస్టర్ మూవీ విరూపాక్షలో కీలక పాత్రలో నటించిన మెప్పించింది. శ్యామల పాత్రకి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

తాజాగా శ్యామల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ లో, పర్సనల్ లైఫ్ లో ఎదురైన కష్టాల గురించి మాట్లాడింది.అమ్మను ఒప్పించి పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేదనిపించింది. మాకు ఒక బాబు పుట్టాక రెండు ఫ్యామిలీలు కలసిపోయి ఆనందంగా ఉన్నాం. నేను 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా యాంకరింగ్ చేశాన‌ని కూడా చెప్పుకొచ్చింది.. నాకు బాబు పుట్టాక కాస్త గ్యాప్ రావ‌డం, ఆ సమయంలో బిగ్ బాస్ నుంచి పిలుపు రావ‌డం నేను దానికి వెళ్ల‌డం జ‌రిగింది. అయితే 11 నెలల బిడ్డని వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళింది అంటూ న‌న్ను దారుణంగా ట్రోల్ చేశారు. డబ్బుకోసం బిడ్డని కూడా వదిలేసింది అని ఎన్నో మాట‌లు అన్నారు. కానీ నా ఫ్యామిలీ నాకు ఎప్పుడు సపోర్ట్ ఇవ్వడంతో మిగిలిన కామెంట్స్ పెద్ద‌గా పట్టించుకోవలసిన అవసరం రాలేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here