వసూళ్ళతో పాటు స్టార్స్ చేస్తున్న యాడ్స్‌ను బట్టి స్టార్‌డమ్ అంచనా వేస్తున్న రోజులు ఇవి. ఆడియన్స్‌లో, పబ్లిక్ మార్కెట్‌లో స్టార్స్‌కు ఎంత క్రేజ్ ఉందనేది చెప్పడానికి యాడ్స్ ఉపయోగపడుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇప్పుడు ఉత్తరాదిలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆ మాటకు వస్తే… జపాన్‌లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో నటనతో పాటు జపనీస్ స్పీచ్‌తో అక్కడి ప్రజలను ఆయన ఆకట్టుకున్నారు.
ఈ స్టార్ హీరో ఓ వైపు సినిమాలతోపాటు మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో కూడా కనిపిస్తుంటాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా గ్లోబల్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ బ్రాండ్ ను ప్రమోట్ చేసేందుకు సంతకం చేశాడు తారక్. ఈ బ్రాండ్ కమర్షియల్ యాడ్ షూట్ భారీ స్థాయిలో జెట్‌స్పీడులో కొనసాగుతుందట. ఆర్‌ఆర్‌ఆర్ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తర్వాత తారక్ ఇలాంటి ఎండార్స్ మెంట్ తీసుకోవడం తొలిసారి కావడం విశేషం. ఎన్టీఆర్ ఈ యాడ్ కోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. షూటింగ్ పూర్తయితే.. గ్రాండ్‌గా యాడ్‌ను లాంఛ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట యూనిట్ మెంబర్స్.
ఇంతకు ముందు Appy Fizz డ్రింక్ కోసం ఎన్టీఆర్ యాడ్ చేశారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే ఇంటికి మీట్ డెలివరీ చేసే యాప్ కోసం యాడ్ చేశారు. దాంతో ఎన్టీఆర్ ఎక్కువ ఫుడ్ యాడ్స్ చేస్తున్నారని కొందరు అంటున్నారు. సినిమాలకు వస్తే… త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమా (NTR 30) షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నారు. ఆ సినిమాకు ‘దేవర’ టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం జరిగింది. దాన్ని చిత్ర బృందం ఖండించింది. ప్రస్తుతం కొరటాల శివ ఫుల్ స్వింగులో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నారు.