ఇండస్ట్రీ లో ఎలాంటి పాత్రలు ఇచ్చిన చెయ్యగలిగే సత్తా ఉన్న నటులు కొంతమంది మాత్రమే ఉంటారు, వాళ్ళు మన మధ్య ఉన్నా లేకపోయినా వాళ్ళు పోషించిన అద్భుతమైన పాత్రల ద్వారా, ఈ భూమి జీవంతో ఉన్నంత కాలం చిరంజీవులుగా మిగిలిపోతారు. ఒక నటుడికి మాత్రమే దక్కే అరుదైన అదృష్టం ఇది, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి అదృష్టం దొరకదు.అలా మనం జీవితాంతం గుర్తించుకోదగ్గ పాత్రలు పోషించి విలన్ గా , కమెడియన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న నటుడు ‘ఆహుతి’ ప్రసాద్. ఇతను అక్కినేని నాగార్జున మొట్టమొదటి చిత్రం ‘విక్రమ్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.
ఇతని మూడవ సినిమా ‘ఆహుతి’ ఆయన కెరీర్ ని మలుపు తిప్పింది అనే చెప్పాలి.ఈ సినిమాలో ఆయన అద్భుతమైన నటనకి గాను విమర్శకుల ప్రశంసలతో పాటు, ఎన్నో అవార్డ్స్ మరెన్నో రివార్డ్స్ కూడా వచ్చాయి.ఆ చిత్రం తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి అనతి కాలం స్టార్ ఆర్టిస్టుగా ఎదిగాడు. ముఖ్యంగా ఈయన చందమామ సినిమాలో పోషించిన పాత్ర ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. అలాంటి మహానటుడు 2015 వ సంవత్సరం లో క్యాన్సర్ వ్యాధితో కన్నుమూసాడు.
ఆయన చివరిసారిగా వెండితెర మీద నారా రోహిత్ హీరోగా నటించిన ‘శంకర’ అనే సినిమాలో కనిపించాడు.అయితే మనకెవ్వరికీ తెలియని విషయం ఏమిటంటే ఆహుతి ప్రసాద్ కొడుకు కార్తీక్ రీసెంట్ గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సంతోష్ శోభన్ హీరో గా నటించిన ‘కళ్యాణం కమనీయం’ అనే చిత్రం లో ఆయన ఒక ముఖ్యపాత్ర పోషించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ కార్తీక్ కి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత ఆయనకి వరుసగా ఆఫర్లు కూడా వస్తున్నాయి.
చూసేందుకు హీరోలాగా కనిపిస్తున్నప్పటికీ ఈయన తన తండ్రిలాగానే క్యారక్టర్ ఆర్టిస్టు గా స్థిరపడిపోబోతున్నట్టు తెలుస్తుంది. హీరో అంటే అన్నీ పాత్రలు చెయ్యడానికి కుదరదు, అదే క్యారక్టర్ ఆర్టిస్టు అయితే ఎలాంటి పాత్రని చేయడానికైనా స్కోప్ దక్కుతుంది. అందుకే క్యారక్టర్ ఆర్టిస్టుగానే రాణించాలనుకుంటున్నాను అంటూ ఆయన పలు ఇంటర్వ్యూస్ లో కూడా తెలిపాడు. మరి ఆయన కూడా తన తండ్రిలాగానే గొప్ప క్యారక్టర్ ఆర్టిస్టు అవుతాడా లేదా అనేది చూడాలి. అయితే కార్తీక్ కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.