అక్కినేని నాగ చైతన్య , కృతి శెట్టి కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం కస్టడీ ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. నాగ చైతన్య ఈ సినిమాతోనే తమిళ్లో అడుగుపెడుతున్నారు. సినిమా మే 12న విడుదల కానుండగా.. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ప్రచారంలో భాగంగా కృతి నాగచైతన్యల మధ్య బాగోతం బయటపడింది. మరీ కృతి అయితే ఈ అక్కినేని హీరోని తెగ పొగిడేసింది.
వీళ్లిద్దరూ కలిసి ఇప్పటికే బంగార్రాజు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇటీవల నాగచైతన్య ను ఉద్దేశిస్తూ ఈ అమ్మడు మాట్లాడింది. తను ఎప్పుడూ నా ఫేవరెట్. నా బంగార్రాజు, ఇప్పుడు నా శివ. ఆయన ఈ క్యారెక్టర్ ప్లే చేసిన విధానానికి అందరూ లవ్‌లో పడిపోతారు. నా లైఫ్‌లో కొంతమంది ఇన్స్పిరేషన్గా ఉన్నారు. అందులో చైతన్య ఒకరు. ఇక సినిమాలో శివ తన డ్యూటీ కోసం ఫైట్ చేస్తాడు. రేవతి తన ప్రేమ్ కోసం ఫైట్ చేస్తుంది. తప్పకుండా ఈ సినిమా ద్వారా మిమ్మల్ని అందరినీ మా కస్టడీలోకి తీసుకునేందుకు రెడీగా ఉన్నాం.
మరోవైపు నాగచైతన్య కూడా ఆమెపై ఉన్న ప్రేమను తెలపకనే తెలిపాడు. నాగ చైతన్య మాట్లడుతూ ‘పూజాహెగ్డే స్టైల్ అంటే నాకెంతో ఇష్టం. కృతిశెట్టి అమాయకత్వం చూడముచ్చటగా ఉంటుంది. అద్భుతమైన చిత్రాల్లో నటించాలనే తపన తనలో ఉంది. ప్రతిరోజూ సెట్‌కు రాగానే పాత్ర గురించి, సీన్స్ గురించి ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది. సాయిపల్లవి డ్యాన్స్ బాగుంటుంది. ఆమె ఉండటం వల్లే ‘లవ్‌స్టోరీ’లో డ్యాన్స్ రిహార్సల్స్ కోసం ఎక్కువ గంటలు కేటాయించాను. శ్రుతిహాసన్ మల్టీ టాలెంటెడ్. ఆమె పాటలు నాకు నచ్చుతాయి. ఇక, సమంత హార్డ్‌వర్కర్. పరిస్థితులు ఎలా ఉన్నా దృఢ సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తుంది. ఏదైనా అనుకుంటే కచ్చితంగా చేసి తీరుతుంది. ‘మజిలీ’ తర్వాత సామ్ నటించిన ‘ఫ్యామిలీమ్యాన్’, ‘ఓ బేబీ’ సినిమాలు నాకెంతో నచ్చాయి. ఆమె నటించిన ‘యశోద’ కూడా చూశాను’