శ్రీజ విడాకులు క్యాన్సిల్ చేసుకుందా.. ఎమోషనల్ గా కల్యాణ్ దేవ్ పోస్ట్

- Advertisement -

శ్రీజ గత ఏడాది జనవరిలో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన పేరు చివర ‘కళ్యాణ్’ను తొలగించి కేవలం శ్రీజ అని మాత్రమే రాశారు. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ‘శ్రీజ కొణిదెల’ అని రాశారు. అప్పటి నుంచి శ్రీజ వైవాహిక జీవితం మీద వదంతులు వినిపిస్తున్నాయి. వాళ్ళిద్దరూ వేరు పడ్డారని, విడాకులు తీసుకున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి సమాచారం అందింది. అయితే, ఆ విషయాన్ని ఎప్పుడూ ఇద్దరూ అధికారికంగా వెల్లడించలేదు. కళ్యాణ్ పేరు తీసేశారు తప్ప… ఆయనతో పాటు పిల్లలతో దిగిన ఫోటోలు డిలీట్ చేయలేదు, అలాగే ఉన్నాయి. దీంతో అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందని అంతా అనుకుంటున్నారు.

శ్రీజ
శ్రీజ

తాజాగా కల్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ వైరలవుతోంది. కళ్యాణ్ దేవ్ (Kalyan Dev) తన సోషల్ మీడియా ఖాతాలో తాజాగా ఒక వీడియో స్టేటస్ పెట్టారు.ఇక అందులో ఏముందంటే స్కూల్లో ఒక పాప కల్చరల్ ప్రోగ్రామ్లో పాల్గొని స్టేజ్ పై పర్ఫామెన్స్ చేస్తూ తన తల్లిదండ్రులిద్దరిని చూస్తూ చాలా ఆనందపడుతుంది. ఈ వీడియోని స్టేటస్ పెట్టుకున్న కళ్యాణ్ దేవ్ ఒక కామెంట్ కూడా పెట్టారు. పిల్లలకి తల్లి తండ్రి ఇద్దరు ఉంటేనే సంతోషం. నేను నవిష్క,నివృత్తి ఇద్దరినీ చాలా మిస్ అవుతున్నాను.. అంటూ పోస్ట్ పెట్టారు. దీని అర్థం ఇన్ని రోజులు మిస్ అయ్యారా లేదంటే ఇకపై ఎప్పటికీ మిస్ అవుతున్నారా అన్నది అర్థం కాక జనాలకు పిచ్చెక్కుతోంది.

మెగాస్టార్ చిరంజీవికి సినీరంగంలో ఎంత మంచి పేరు ఉందో తెలిసిందే. ఆయన చిన్న కూతురు శ్రీజ సినిమాల్లో రాణించకపోయినప్పటికీ తన వ్యక్తిగత విషయాల కారణంగా ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే నిలుస్తుంది. శ్రీజా ఇప్పటికే రెండు పెళ్లిళ్లు తీసుకొని ఇద్దరికి దూరంగానే ఉంటుంది. త్వరలోనే మూడో పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక శ్రీజ మొదట భరద్వాజ్ అనే అబ్బాయితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులకు మళ్లీ అతనికి విడాకులు ఇచ్చేసి ఇంటికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత చిరంజీవి కళ్యాణ్ దేవ్ అనే అబ్బాయిని ఇచ్చి గ్రాండ్ గా పెళ్లి చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here