అనసూయ గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో యాంకర్ అనసూయ విజయ్ దేవరకొండ పై సెటైర్లు వేస్తూ రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమె మాటలను విజయ్ దేవరకొండ పట్టించుకోకపోయినా, ఆయన ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా లో అనసూయ పై చాలా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఆమెని కావాలని వెక్కిరిస్తూ ‘ఆంటీ’ అని పిలుస్తున్నారు. ట్విట్టర్ లో అయితే ‘ఆంటీ’ అనే పదం బాగా ట్రెండ్ అయ్యింది కూడా, కేవలం ఈ పదం పైన వేలకొద్ది ట్వీట్స్ పడ్డాయి.
కాసేపు ఈ విజయదేవరకొండ వివాదం పక్కన పెడితే అనసూయ కి ఎవరైనా ఆంటీ అని పిలిస్తే చాలా ఫైర్ అయిపోతుంది, అలా పిలిచినందుకు కొంతమంది నెటిజెన్స్ పై ఆమె పోలీస్ కేసు కూడా నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి. ‘ఆంటీ’ అనే పదం లో ఏమి తప్పు ఉంది..? , ఇంత చిన్న దానికే అంత రెచ్చిపోవాల్నా అని కొంతమంది నెటిజెన్స్ అనసూయ ని తప్పుబట్టారు.
అయితే రీసెంట్ గా ఈ వివాదం పై గృహలక్ష్మి సీరియల్ హీరోయిన్ కస్తూరి స్పందించింది, ఆమె మాట్లాడుతూ ‘చిన్న పిల్లలు ఆంటీ అని పిలవడం లో ఎలాంటి తప్పు లేదు, అది వాళ్ళ దృష్టిలో గౌరవం తో పిలిచినట్టు.అంతే కానీ దున్నపోతులా ఉన్నవాళ్లు వచ్చి ఆంటీ అని పిలిస్తే అది చాలా పెద్ద తప్పు. ఆంటీ అనే పదం కొన్ని సార్లు చెడ్డ అర్థాలు దారి తీస్తుంది.ఒక స్త్రీ ని గౌరవంగా పిలవాలంటే కేవలం ఆంటీ అనే సంబోధించాల్సిన అవసరం లేదు, ‘అమ్మా’ అని పిలవండి, లేకపోతే ఎంతో మంచి గౌరవమైన పదం ‘గారు’ అని పిలవండి. అవన్నీ వదిలేసి ఆంటీ అని పిలవడం ఏమిటి..?, మమల్ని పిలిచినట్టు ఒక సీనియర్ హీరో దగ్గరకి వెళ్లి అంకుల్ అని పిలవగలరా.
మగవాళ్లకు ఎంతో గౌరవం ని ఇచ్చే పిలుపు ‘అంకుల్’. వాళ్ళని మాత్రం పిలవరు, మమల్ని మాత్రం ఆంటీ అని పిలుస్తారు, వాళ్ళు ఏ ఉద్దేశ్యం తో పిలుస్తున్నారు అనేది మాకు అర్థం కాకుండా ఉండదు కదా’ అని చెప్పుకొచ్చింది.