బ్లాక్ బస్టర్ హిట్స్ గత కొద్ది సంవత్సరాల నుండి మన తెలుగు సినిమాలు భాషతో సంబంధం లేకుండా తెగ ఆడేస్తున్నాయి. స్టార్ హీరో మరియు చిన్న హీరో అని తేడాని ఎవ్వరు గమనించడం లేదు, కంటెంట్ బాగుంటే చాలు, నెత్తిన పెట్టుకొని ఆదరిస్తున్నారు. అందుకు ఉదాహరణ బాహుబలి సిరీస్, KGF సిరీస్, కాంతారా, పుష్ప మరియు కార్తికేయ 2. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాలు సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు.

ఇందులో కాంతారా మరియు KGF సిరీస్ మినహా, మిగిలినవన్నీ తెలుగు సినిమాలే అవ్వడం విశేషం. అంతే కాదు ఇండియా లో టాప్ 1 గ్రాసర్ గా నిల్చిన బాహుబలి 2 సినిమా కూడా మన తెలుగే. ఈ చిత్రాలన్నిటికీ కంటెంట్ మరియు టాక్ తో పాటుగా అదృష్టం కూడా కలిసి వచ్చాయి, అందుకే కమర్షియల్ గా బాలీవుడ్ లో మాత్రమే కాదు, ఇతర బాషలలో కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి.

అయితే రీసెంట్ గా సమ్మర్ లో విడుదలై బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన న్యాచురల్ స్టార్ నాని ‘దసరా’ మరియు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘విరూపాక్ష’ చిత్రాలను ఇతర బాషలలో కూడా డబ్ చేసి వదిలారు. కానీ ప్రొమోషన్స్ ఎదో మొక్కుబడిలాగా చెయ్యడం తో ఆడియన్స్ కి ఈ రెండు చిత్రాలు రీచ్ కాలేకపోయాయి. ‘దసరా’ సినిమా ఆడలేదు అంటే పర్వాలేదు అనుకోవచ్చు కానీ, విరూపాక్ష లాంటి చిత్రం కూడా ఆడలేదంటేనే ఆశ్చర్యం వేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఎందుకంటే విరూపాక్ష చిత్రాన్ని కచ్చితంగా థియేటర్స్ లో చూస్తే తప్ప థ్రిల్లింగ్ అనుభూతి రాదు. అలాంటి సినిమా కూడా ఇతర బాషలలో క్లిక్ కాకపోవడం ఆశ్చర్యార్ధకం. ఈ సినిమాలు ఇతర బాషలలో క్లిక్ కాకపోవడానికి కారణం ప్రొమోషన్స్ సరిగా చెయ్యకపోవడం వల్లే. #RRR , బాహుబలి వంటి సినిమాలకు కూడా ఊరికే ఓపెనింగ్ రాలేదు. రాజమౌళి మరియు టీం నెల రోజుల వరకు హిందీ లో ఉన్న ప్రముఖ మీడియా చానెల్స్ అన్నిటికీ ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు. ఎవరికైనా నార్త్ మార్కెట్ కావాలనుకుంటే టీజర్ , ట్రైలర్ తో పాటుగా ప్రొమోషన్స్ చెయ్యడం కూడా చాలా ముఖ్యం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
