ఉగ్రం అల్లరి నరేష్ హీరో గా నటించిన రీసెంట్ చిత్రం ‘ఉగ్రం’ ఇటీవలే గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రం లో చిన్న చిన్న మార్పులు చేసి ఉంటే, ఈరోజు అల్లరి నరేష్ కెరీర్ లో మాత్రమే కాదు, సమ్మర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచేదని, డైరెక్టర్ విజయ్ ఎడిటింగ్ వర్క్ లో శ్రద్ద వహించలేదనే కామెంట్స్ బాగా వినిపించాయి.
మితిమీరిన ఎమోషనల్ సన్నివేశాలు అర్థం పర్థం లేకుండా ఉండడం వల్లే, జనాలు అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాలేకపోయారని, నేడు ఈ చిత్రానికి వస్తున్న వసూళ్లు మొత్తం అల్లరి నరేష్ ని చూసి మాత్రమే అని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని అల్లరి నరేష్ కంటే ముందుగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కి వినిపించాడట డైరెక్టర్ విజయ్.
అయితే కథ మొత్తం విన్న తర్వాత కళ్యాణ్ రామ్ కొన్ని కీలకమైన మార్పులు చెప్పాడట, కానీ కథలో మార్పులు చెయ్యడానికి విజయ్ అంగీకరించకపోవడం తో కళ్యాణ్ రామ్ ఈ చిత్రానికి నో చెప్పాడట.ఆయన చెప్పిన మార్పుల గురించే సినిమా విడుదల తర్వాత అందరూ మాట్లాడుకుంటున్న విషయం.ఆ మార్పులు చెయ్యమనే కళ్యాణ్ రామ్ చెప్పాడట, దానికి విజయ్ ఒప్పుకోకుండా, అల్లరి నరేష్ తో తీసాడు.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 6 కోట్ల రూపాయలకు జరగగా, మొదటి మూడు రోజుల్లో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఈరోజు వర్కింగ్ డే అయ్యినప్పటికీ కలెక్షన్స్ స్టడీ గా ఉండడం తో ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవుతుందని అనుకుంటున్నారు ట్రేడ్ పండితులు. డైరెక్టర్ ఎడిటింగ్ వర్క్ మీద శ్రద్ద పెట్టి పెట్టి ఈ చిత్రం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యేదని విశ్లేషకులు చెప్తున్న మాట.