టాలీవుడ్ లో క్రేజ్ / ఫాలోయింగ్ అనే పదాలు తీస్తే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ తొలిసినిమా నుండి తనదైన మార్కుని సంపాదించుకోవడం కోసం ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు,అందుకే ఆయన అంటే యూత్ కి అంత పిచ్చి.

హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా గడిచిన రెండు దశాబ్దాల నుండి ఆయనకీ ఫ్యాన్స్ పెరుగుతూనే ఉన్నారు కానీ, ఇసుమంత కూడా తగ్గలేదు. ఆయనకీ అలాంటి క్రేజ్ ఉంది కాబట్టే 2001 వ సంవత్సరం లోనే ఇండియాలో మోస్ట్ పాపులర్ బ్రాండ్ ‘పెప్సీ’ కూల్ డ్రింక్ సంస్థ పవన్ కళ్యాణ్ ని పెట్టి యాడ్ తీసింది.సౌత్ ఇండియా లో ఒక స్టార్ హీరో ప్రోడక్ట్స్ కి యాడ్ ఇవ్వడం జరిగింది ఇదే తొలిసారి, ఆ తర్వాతే మెగాస్టార్ చిరంజీవి ‘థమ్స్ అప్’ యాడ్ వచ్చింది.

అయితే పవన్ కళ్యాణ్ ఈ యాడ్ చేసినందుకు గాను అప్పట్లో తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు. విశ్వసనీయ వర్గాల నుండి తెలిసిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కి ఈ యాడ్ లో నటించినందుకు గాను ‘పెప్సీ’ సంస్థ కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ఇచ్చింది అట. అప్పట్లోనే కోటి పైగా రెమ్యూనరేషన్ అందుకున్నాడు అంటే పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు ఆయన యాడ్స్ ఒప్పుకొని చేస్తే , కేవలం ఒక్క యాడ్స్ నుండే ఏడాదికి 80 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకి 70 నుండి 100 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.ప్రస్తుతం ఆయన #PKSDT , #OG , హరి హర వీరమల్లు మరియు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.వీటిల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ కి సంబంధించిన మొదటి గ్లిమ్స్ వీడియో 11 వ తేదీన విడుదల కాబోతుంది.
