ఔను.. త్రిష బాయ్ ఫ్రెండ్ తో నేను డేటింగ్ చేస్తున్నాను.. పబ్లిక్ గా చెప్పిన హీరోయిన్

- Advertisement -

అవకాయ్ బిర్యానీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది బిందు మాధవి. తర్వాత తమిళంలోనూ పలు సినిమాల్లో చేసింది. బిగ్బాస్ నాన్ స్టాప్ ఓటీటీ షో ద్వారా మరోసారి అభిమానులను అలరించింది. ఈ రియాలిటీ షో ద్వారావచ్చిన గుర్తింపుతో ఇండస్ట్రీలో మరోసారి అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ఆమె ప్రధానపాత్రలో నటించిన న్యూసెన్స్ వెబ్ సిరీస్ మే12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. శనివారం దీని ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది.

బిందు మాధవి
బిందు మాధవి

ఈ ప్రెస్ మీట్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.. హీరో నవదీప్, హీరోయిన్ బింధు మాధవిలపై ఇప్పటివరకూ వార్తల్లో వచ్చిన గాసిప్‌లను ఒక్కొక్కటిగా చదువుతూ.. నిజమా? కాదా? అని అడిగింది. నవదీప్‌కి సంబంధించిన గాసిప్‌ల లిస్ట్ చాలానే ఉండటంతో.. ఒక్క డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూ తప్ప.. తనపై వచ్చినవన్నీ రూమర్లే అనేశారు. హీరోయిన్ బిందు మాధవిపై వచ్చిన ఒకే ఒక రూమర్‌పై కూడా ప్రశ్న ఎదురైంది. త్రిష బాయ్ ఫ్రెండ్‌తో మీరు డేటింగ్‌లో ఉన్నారనే రూమర్ వచ్చింది? అది నిజమా కాదా? అని యాంకర్ అడగడంతో.. దాటవేత ధోరణిలో కాకుండా చాలా సూటిగా ఆన్సర్ ఇచ్చింది బింధుమాధవి.

Bindhu Madhavi

ఔను నిజమే.. కానీ.. వేరు వేరు సందర్భాల్లో అది జరిగింది. ఒకే టైంలో ఇద్దరం చేయలేదు. త్రిష‌తో బ్రేకప్ అయిన తరువాత నాతో డేట్. నిజాన్ని ఒప్పుకోవాలి తప్పదు’ అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది బిందుమాధవి. టాలీవుడ్‌లోనూ ఇతర ఉడ్‌లలోనూ సీక్రెట్ యవ్వారాలు నడిపించి.. పైకి సుద్దపూస ముచ్చట్లు చెప్పేవాళ్లు చాలామంది ఉన్నారు కానీ.. వాళ్లలా కాకుండా.. తన ఎఫైర్ గురించి సూటిగా సుత్తిలేకుండా చెప్పేసింది బింధుమాధవి. తమిళ్‌లో సినిమా చేస్తున్నా.. నాకు తెలుగులో అవకాశాలు రావడం లేదని చెన్నై వెళ్లి.. తమిళ్ సినిమాలు చేశాను. కొన్నాళ్లు నా పర్సనల్ రీజన్స్ వల్ల సినిమాలు చేయలేదు. బిగ్ బాస్ తరువాత కమ్ బ్యాంక్ అయ్యాను. ఈసారి స్ట్రాంగ్‌గా తెలుగులోనే ఉంటానని అనుకుంటున్నా’ అని చెప్పింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here