మ్యాచో స్టార్ గోపీచంద్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రామబాణం’ నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.శ్రీవాస్ దర్శకత్వం లో గోపీచంద్ గతం లో ‘లక్ష్యం’ మరియు ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.మళ్ళీ ఆయనతో ‘రామబాణం’ అనే సినిమా తియ్యడం తో ఈ చిత్రంకి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.
దానికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది.ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రం బిజినెస్ దాదాపుగా 15 కోట్ల రూపాయలకు జరిగిందట.అయితే జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి, మొదటి రోజు వచ్చిన ఓపెనింగ్ కి ఏమాత్రం సంబంధం కనిపించడం లేదు.వచ్చిన టాక్ కి డీసెంట్ ఓపెనింగ్ ని రాబట్టినప్పటికీ అది బ్రేక్ ఈవెన్ కి ఏ మాత్రం ఉపయోగపడదు అని అర్థం అవుతుంది.
ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల నుండి రెండు కోట్ల రూపాయిల షేర్ కి దగ్గరగా వసూళ్లు వచ్చినట్టు సమాచారం. వచ్చిన డిజాస్టర్ టాక్ కి ఇది డీసెంట్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు, ముఖ్యంగా మాస్ ప్రాంతాలలో ఈ సినిమాకి మార్నింగ్ ఆట నుండి నైట్ షోస్ వరకు డీసెంట్ వసూళ్లు వచ్చాయి.కానీ బ్రేక్ ఈవెన్ నెంబర్ ఎక్కువ ఉండడం వల్ల చాలా తక్కువ ఓపెనింగ్ లాగ అనిపిస్తుంది.
ఒక సినిమాకి మంచి ఓపెనింగ్ రావాలంటే తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో కూడా మంచి వసూళ్లను రాబట్టాలి, కానీ రామబాణం విషయం లో ఓవర్సీస్ మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వసూళ్ల రేంజ్ కేవలం 30 లక్షల రూపాయిలు మాత్రమే ఉంటుంది. మొత్తం మీద ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ మాత్రమే వచ్చిందని అంటున్నారు.