తెలుగు, తమిళ ప్రేక్షకులకు హీరోయిన్ జ్యోతిక గురించి తెలుసు..డేరింగ్, డ్యాసింగ్ ఉమెన్.. హీరో సూర్య భార్య కూడా.. వీరిద్దరూ వరుస సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ తో దూసుపోతున్నారు.. ఇండస్ట్రీలో అతి తక్కువ మంది లవ్లీ కపుల్స్ లో ఈ జంట ఒకటి.. ఎప్పుడూ ఎటువంటి రూమర్స్ లేకుండా ఇటు సినీ లైఫ్ ను, అటు ఫ్యామిలి లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.. అయితే ఈ మధ్య జ్యోతిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమా అప్డేట్స్ ను ఫ్యామిలి విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తుంది.. తాజాగా షాకింగ్ పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ లో జ్యోతిక జిమ్ లో భారీ కసరత్తులు చేస్తూ చెమటకు చిందిస్తుంది.. ఈ వయస్సులో అంతలా కష్ట పడటం అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు..
సూర్య సౌత్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. మ్యారేజ్ తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన జ్యోతిక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. గత ఏడాది వచ్చిన రెండు సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాలని జ్యోతిక ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అమ్మడు ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తుంది.. ఇప్పుడు జ్యోతిక వయస్సు 44 సంవత్సరాలు.. ఈ వయసులో కూడా జ్యోతిక జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ తన ఫిజిక్ కాపాడుకుంటోంది..
తాజాగా జ్యోతిక జిమ్ లో కష్ట పడుతున్న వీడియోను షేర్ చేసింది.. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భయంకరమైన ఫీట్స్ తో జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఆ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తలక్రిందులుగా జ్యోతిక చేస్తున్న వర్కౌట్స్ కి సెలెబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు.. ఎటువంటి బెనుకు లేకుండా ఆమె చెయ్యడం పై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.. యాషిక ఆనంద్, దియా మీనన్ లాంటి సెలెబ్రిటీలు సెల్యూట్ మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
మీ భర్త సూర్య కూడా ఇలాంటి ఫీట్లు చేయలేరేమో మీరు ఆదరగోడుతున్నారు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో ట్రెండ్ అవుతుంది.. ఇక సూర్య ప్రస్తుతం.. డైరెక్టర్ శివ దర్శకత్వంలో కంగువ అనే హై బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకేక్కుతుంది..