సమంత ఒకవైపు అరుదైన వ్యాధితో.. మరోవైపు నెటిజన్ల విమర్శలతో సమంత సంపాదన విషయంలో మాత్రం వెనక్కి తగ్గట్లేదు.. అంతకు అంత పెంచుకుంటూ బాగానే సంపాదిస్తుంది..ఆమె అటు సినిమాలు, ఇటు సోషల్ మీడియా, కమర్షియల్ యాడ్స్, వ్యాపారాల నుంచి గట్టిగానే సంపాదిస్తుందట.. సోషల్ మీడియాలో సమంత ఫాలోయింగ్ ఏ రేంజులో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పానక్కలేదు.. సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా డబ్బులను సంపాదిస్తుందని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతని రెండున్నర కోట్ల మంది ఫాలో అవుతుంటే, ట్విట్టర్‌లో కోటీ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్‌బుక్‌తో కలిసి ఆమెకి సుమారు నాలుగు కోట్ల ఫాలోవర్స్ ఉన్నారు..
ఇదిలా ఉంటే సమంతకి సోషల్ మీడియా ఆదాయ మార్గంలా మారింది. ఆమెకి ఉన్న ఫాలోవర్సే ఇన్ కమ్ సోర్స్ గా మారడం విశేషం. సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటే, అంత ఎక్కువగా సంపాదిస్తున్నారు సెలబ్రిటీలు. సామాజిక మాధ్యమాలు వారికి మరో పెద్ద ఇన్‌కమ్ సోర్స్ గా మారాయి. వీరు కమర్షియల్ యాడ్స్ చేస్తుంటారు. వాటిని తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పోస్ట్ చేస్తుంటారు. ఇలా పోస్ట్ చేయడానికి కూడా డబ్బులు వసూలు చేస్తుంటారు. ఇలా సెలబ్రిటీలు, ముఖ్యంగా హీరోయిన్లకి ఇప్పుడు ఇన్‌గ్రామ్, ట్విట్టర్ సినిమాల తర్వాత మరో సోర్స్ గా మారాయని చెప్పడం లో సందేహం లేదు…
ఈ మేరకు సమంత బాగానే సంపాదిస్తుంది..ఆమె ఒక్కో పోస్ట్ కి ఇరవై లక్షల వరకు పారితోషికం తీసుకుంటుందట. ఈ లెక్కన సమంత నెలకి రెండుమూడు యాడ్స్ చేస్తుంటుంది. వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటుంది. ఈ లెక్కన ఏడాదికి ఒక్క సినిమాకి మించిన పారితోషికం ఇలా యాడ్స్ రూపంలోనే పొందుతుంది సమంత. ప్రస్తుతం ఆమె టామీ హిట్ ఫిగర్ వాచెస్, మిల్లెట్ మిల్క్, పీజీ శిక్ష, పెప్సీ వంటి యాడ్స్ చేస్తుంది. ఇలా యాడ్స్ రూపంలో, అలాగే ఆయా యాడ్స్ పోస్ట్ ల రూపంలో గట్టిగానే సంపాదిస్తుంది సమంత. ఇదంతా వారికి సైడ్ ఇన్‌కమ్‌గా చెప్పొచ్చు.. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉంది.. ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండతో ఖుషి
సినిమా చేస్తుంది. మరోవైపు హిందీలో వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్
వెబ్ సిరీస్ చేస్తుంది. అలాగే ఓ ఇంటర్నెషన్ ప్రాజెక్ట్ ఉంది. ఇలా అన్ని రూపాల్లో సమంత ఏడాదికి పదిహేను నుంచి 20కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాక్…