Amala Paul: అమలపాల్.. చిత్రపరిశ్రమలోని వారికి పరిచయం అవసరం లేని పేరు. తమిళ సినిమాలతో పాటు.. తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ భామ..తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. అమలాపాల్ సినిమా‘ఆడై’ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో అమలాపాల్ న్యూడ్‌గా కనిపిస్తోంది. కేరళ ముద్దుగుమ్మను ఇలా చూసిన వాళ్లంతా షాక్ అయ్యారు. అయితే ఈ సినిమాను విడుదలవ్వ కుండా మహిళా సంఘాలు గోల చేశాయనుకోండి.
తాజాగా ఈమె పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన ‘ఆడుజీవితం’ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీలో లిప్ లాక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. ఈ విషయం పై అమలా పాల్ స్పందిస్తూ.. ” ‘ఆడు జీవితం’ స్టోరీ వినిపించే సమయంలోనే ఆ సన్నివేశం ఉంటుందని దర్శకుడు ముందుగానే చెప్పాడు. అందుకు నేను ముందుగానే అంగీకరించాను. పైగా ఆ సన్నివేశం లిప్ లాక్ చేస్తేనే పండుతుంది. అందుకే అలా నటించాను. నా వరకు కథ డిమాండ్ చేస్తే బట్టలు విప్పేసి నటించేందుకు ఎప్పుడూ సిద్దమే. గతంలో కూడా బట్టలు లేకుండా నటించాను. కాబట్టి ఈ చిత్రంలో లిప్ లాక్ సన్నివేశంలో నటించడం పెద్ద విషయంగా ఏమీ అనిపించలేదు” అంటూ చెప్పుకొచ్చింది అమలా పాల్. ఆమె కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ పై నెటిజెన్ల సెటైర్లు కూడా విసురుతున్నారు.
‘బెజవాడ’ ‘లవ్ ఫెయిల్యూర్’ ‘నాయక్’ ‘ఇద్దరమ్మాయిలతో’ ‘జెండా పై కపిరాజు’ ‘పిట్ట కథలు'(వెబ్ సిరీస్) వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. కానీ అవి సక్సెస్ కాకపోవడంతో ఎక్కువగా మలయాళం, తమిళ భాషల సినిమాల్లోనే నటిస్తూ వస్తోంది. బోల్డ్ నెస్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ గా అమలా పాల్ ను చెప్పుకోవచ్చు. ఈమె పోషించే పాత్రలు అలా ఉంటాయనే ఉద్దేశంతో మాత్రమే ఈ మాట చెప్పడం లేదు.