Niharika Konidela : గత కొంతకాలం నుండి ఇండస్ట్రీ లో జోరుగా ప్రచారం సాగుతున్న వార్త నిహారిక కొణిదెల విడాకులు తన భర్త చైతన్య తో విడాకులు తీసుకోవడం. మెగా బ్రదర్ నాగబాబు ఈ పెళ్లిని ఎంత వైభోగంగా జరిపించాడో మన అందరికీ తెలిసిందే.మెగా కుటుంబం మొత్తం ఈ వివాహ వేడుక లో ఎంతలా ఎంజాయ్ చేసారో..ఇప్పటికి ఆ వీడియోలు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.ఆ వీడియోలు చూస్తూ ఈ వార్త వింటే కన్నీళ్లు ఆగవు.
అయితే ఈ వార్తలపై అటు నిహారిక కొణిదెల కానీ, ఇటు నాగబాబు కానీ ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు.సోషల్ మీడియా లో వచ్చే ఎలాంటి రూమర్ మీదైనా క్షణాల్లో స్పందించి అభిమానులకు క్లారిటీ ఇచ్చే నాగబాబు, ఈ విషయం పై మౌనం పాటించడం చూస్తూ ఉంటే వీళ్లిద్దరికీ నిజంగానే విడాకులు అయిపోయింది అనే నిర్ధారణకు రావొచ్చు.
అంతే కాదు, వీళ్లిద్దరు ఇంస్టాగ్రామ్ లో తాము గతం లో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేసారు, అలాగే ఒకరినొకరు అన్ ఫాలో అయిపోయారు కూడా.ఇది ఇలా ఉండగా నిహారిక కొణిదెల గురించి ఒక వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.అదేమిటి అంటే నిహారిక కి మరియు సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట మెగా బ్రదర్ నాగబాబు.
వరుసకు నిహారిక కు సాయి ధరమ్ తేజ్ భావ అవుతాడు, అప్పట్లో వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటే రూమర్స్ కూడా వచ్చాయి. సోషల్ మీడియా లో అభిమానులు వీళ్లిద్దరు కలిసి ఉన్న ఫోటోలను కూడా అప్లోడ్ చేసి క్యూట్ పెయిర్ అంటూ కామెంట్స్ చేసేవారు కూడా. ఆ తర్వాత కొన్నాళ్ళకు నిహారిక చైతన్య కి పెళ్లి కుదిరింది అనే వార్త రావడం తో ఈ రూమర్స్ కి చెక్ పడింది. ఇప్పుడు కొత్తగా ప్రచారం అవుతున్న రూమర్స్ అయినా నిజం అవుతుందో లేదో చూడాలి.