Pooja Hegde : టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న పూజ హెగ్డే గత ఏడాది నుంచి వరుసగా ప్లాపులతో సతమతమవుతోంది. హీరోయిన్స్ సైతం ఎంత అందంగా ఉన్నప్పటికీ తమ అందాన్ని మెరుగుపరచడం కోసం మరింత సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ ఉంటారు ముఖ్యంగా తిండి విషయంలో, వ్యాయామం, బ్యూటీ టిప్స్ వంటివి ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అయితే పూజ హెగ్డే కూడా గ్లామర్ గా కనిపించేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది వాటిని అభిమానులతో పంచుకుంది ముద్దుగుమ్మ వాటి గురించి తెలుసుకుందాం.

పూజ హెగ్డే మాట్లాడుతూ.. హీరోయిన్స్ అంటే కచ్చితంగా మేకప్ వేసుకోవాలి అలాగే మన శరీరం మీద రసాయనాల ప్రభావం ఉంటుంది అందుకే సహజమైన ఫేస్ ప్యాక్ ని వేసుకుంటానని తెలియజేస్తోంది. ముఖ్యంగా పసుపు పాలమీగడ కలిపి ముఖానికి ప్యాకులా వేసుకుంటాను కొద్ది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటాను దీంతో ముఖం చాలా తాజాగా మెరుస్తూ ఉంటుందని తెలుపుతోంది. అలాగే రోజు ఒక టీ స్పూన్ నెయ్యి తింటుందట కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే కాయగూరలు, పాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటానని తెలుపుతోంది.

పూజా హెగ్డే కి కూడా సమస్య ఉందట. అదే ఎనర్జీ సమస్య ఆ కారణంగానే శరీరం చాలా పొడిబారుతుందని అందుకే నిద్రలేవగానే ముఖం శుభ్రంగా కడుక్కొని మసాజ్ వంటివి చేసుకుంటానని నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటారని నీటి శాతం అధికంగా ఉండే పళ్ళు కాయగూరలు తింటానని.. ఎండలో ఉన్నప్పుడు టాన్ రాకుండా సన్ స్క్రీన్ రాసుకుంటానని తెలుపుతోంది.
షూటింగ్ లేకపోతే మేకప్ కి కచ్చితంగా దూరంగా ఉంటానని ఒకవేళ వేసుకున్న రాత్రివేళ కచ్చితంగా వాటిని తొలగించి మసాజ్ చేసుకొని మరి పడుకుంటానని తెలుపుతోంది. బయట వాతావరణం వల్ల చర్మం దెబ్బతినకుండా తన బ్యాగులో ఒక స్కిన్ కేర్ ప్రొడక్ట్, లిప్ స్టిక్, సన్ గ్లాసెస్ వంటివి ఉంటాయని తెలుపుతోంది. ముఖ్యంగా తనకు టిష్యూ మసాజ్ అంటే చాలా ఇష్టమని తెలిపింతోంది..