Renu Desai : టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమే.. ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమాలో నటించి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను ప్రేమించి మరీ అతనితో సహజీవనం చేసింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో జానీ సినిమా విడుదలయ్యింది. కానీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. రేణు దేశాయ్ సినిమాలలోకి అడుగు పెట్టకు ముందు మోడల్‌గా , కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా వర్క్ చేసింది. ఆ తర్వాతనే హీరోయిన్గా అడుగు పెట్టింది.

పవన్ కళ్యాణ్ తో పెళ్లికి ముందే రిలేషన్షిప్ మైంటైన్ చేసి అకీరాకు కూడా జన్మనిచ్చింది. ఆ తర్వాత పెద్దల సమక్షంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే వివాహమైన తర్వాత వీరికి ఆధ్యా జన్మించింది. అంతా సంతోషంగా ఉంటున్న సమయంలో వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో కొంతకాలానికి విడిపోవడం జరిగింది. కానీ తన కూతురు , కొడుకు బాధ్యత మాత్రం పవన్ కళ్యాణ్ ఇప్పటికి చూసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో పవన్ కళ్యాణ్ మూడో వివాహాన్ని అన్నాలేజినోవాతో చేసుకున్నాడు. రేణూ మాత్రం తన పిల్లలతో తన జీవితాన్ని చాలా హ్యాపీగా గడుపుతోంది. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్గానే ఉంటూ పలు రకాలుగా పోస్ట్ చేస్తోంది. ముఖ్యంగా పవన్ అభిమానులు సైతం ఈమె పైన పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే తన పిల్లలతో కలిసి మరొకసారి ట్రిప్పుకు వెళ్ళినట్లు తెలుస్తోంది. అక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది రేణు దేశాయ్. తను ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేయగా అందులో తను సముద్రపు ఒడ్డున నీళ్లలో జలకాలాడుతూ కనిపిస్తోంది. అలాగే చిన్న డ్రస్సు వేసుకొని ఉండగా ఆ నీటి అలల తాకిడికి ఆమె థైస్ అందాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.