Supritha సినిమాల్లో కంటే కూడా సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించిన సెలబ్రిటీస్ ఉన్నారు.వారిలో సురేఖ వాణి కూడా ఒకరు, ఎల్లప్పుడూ బోల్డ్ కామెంట్స్ చేస్తూ, తనకి సంబంధించిన హాట్ ఫోటోలు మరియు వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఈమె.ఎవరేమి అనుకున్న పర్వాలేదు,నాకు నచ్చినట్టు బ్రతుకుతాను అనే ధోరణిలోనే ఉంటుంది.ఇక ఈమె కూతురు సుప్రీతా కూడా ఇదే క్యాటగిరీ కి చెందిన అమ్మాయి.ఈమె ఇంకా సినిమాల్లోకి అయితే అడుగుపెట్టలేదు కానీ, సోషల్ మీడియా ద్వారా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది.
ఈమె తన ఇంస్టాగ్రామ్ లో పెట్టే కొన్ని ఫోటోలు మరియు వీడియోలకు లక్షల సంఖ్యల్లో లైక్స్ మరియు కామెంట్స్ రావడం మనం గమనించొచ్చు, ఒక స్టార్ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ కి ఏమాత్రం తీసిపోని అకౌంట్ సుప్రీతాది.ఈమె కూడా వాళ్ళ అమ్మలాగానే బోల్డ్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది, రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఇంటర్వ్యూ లో యాంకర్ సుప్రితా ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ అమ్మగారు డేటింగ్ చెయ్యాల్సి వస్తే టాలీవుడ్ టాప్ హీరోలలో ఎవరిని ఎంచుకుంటారు’ అని అడగగా దానికి సుప్రితా సమాధానం చెప్తూ ‘మా అమ్మ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని, స్టార్ హీరోలతో డేటింగ్ చేసే అవకాశం వస్తే అతనితోనే చేస్తుంది’ అంటూ సమాధానం ఇచ్చింది.ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
‘నాగార్జున అంటే కూడా ఆమెకి బాగా ఇష్టమని, ఆయనతో కూడా డేటింగ్ చెయ్యడానికి ఇష్టపడుతుంది’ అని సుప్రితా ఈ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.మరో పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సుప్రితా పై సోషల్ మీడియా లో విరుచుకుపడుతున్నారు.నువ్వు చేసిన కామెంట్స్ లో తప్పు లేదు కానీ, పవన్ కళ్యాణ్ ని ఇలాంటి వాటిల్లో లాగొద్దు, ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఉన్నారు, ఎదుటి వాళ్ళు ప్రతీ విషయం వక్రీకరించి చూపిస్తూ పవన్ కళ్యాణ్ కి బ్యాడ్ నేమ్ తీసుకొస్తారు అని ఫ్యాన్స్ సుప్రితా ని ఉద్దేశించి కామెంట్ చేస్తున్నారు.