Shruti Haasan : తన మల్టీ టాలెంట్ తో ఎన్నో అవకాశాలు అందుకుంది శ్రుతి హాసన్. ఇటీవలే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో విజయాలను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. తాను హీరోల వయస్సును పట్టించుకోనని తెలిపింది. ఒక నటిగా తన పని తాను చేసుకుంటూ వెళతానని చెప్పింది. ఇంత బోల్డ్ గా కామెంట్ చేసిన శ్రుతిని చూసి అందరూ అవాక్కవుతున్నారు.
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి కథలు నచ్చడం వల్ల నటించానని స్పష్టం చేసింది. హీరోల వయస్సును పట్టించుకోకుండా ఆ సినిమాలలో నటించడంతో రెండు బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకోగలిగానని తెలిపింది. ప్రస్తుతం సలార్ సినిమాతో పాటు ది ఐ అనే సినిమాలో నటిస్తున్నట్లు చెప్పింది. ప్రశాంత్ నీల్ టేకింగ్ మరో ప్రపంచాన్ని తలపిస్తుందని అంది. కుర్రకారుకు డ్రీమ్ గర్ల్ అంటే హేమ మాలిని, శ్రీదేవి అని వాళ్ల అంత పేరు తెచ్చుకోవాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది.
ఇక పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తుంన్నందుకు తనని చాలా మంది ట్రోల్ చేస్తున్నారని వాపోయింది. అలాంటి వారికి తాను ఎప్పుడూ కౌంటర్ ఇస్తూనే ఉంటానని చెప్పింది.సీనియర్ నటులతో నటించడానికి కారణం అవకాశాలు లేవనా లేక డబ్బు కోసమా అంటూ కొందరు నెటిజన్స్ ట్రోల్ చేశారు. అలా కామెంట్స్ చేస్తున్నవారికి స్ట్రాంగ్‌గానే బదులిచ్చినట్లు చెప్పింది. ఇక ప్రస్తుతం ఆమె శాంతను హజారికాతో కలిసి సహ జీవనం చేస్తోంది. పెళ్లి అంటే నమ్మకం ఉన్న లోపల మాత్రం ఏదో తెలియని ఆందోళన ఉన్నట్టు చెప్పింది. పైగా శాంతను తన జీవితంలో వచ్చిన తర్వాత నా లైఫ్‌లో ఎన్నో మార్పులొచ్చాయని అన్నది. వాళ్లద్దరి ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయని తెలిపింది.