Rashmika Mandanna : విజయ్ దేవరకొండ తో డేటింగ్ పై క్రేజీ కామెంట్స్ చేసిన రష్మిక మండన.. ఇక ఫిక్స్ అయ్యినట్టే!

- Advertisement -

Rashmika Mandanna : సోషల్ మీడియా లో ఎంతో కాలం నుండి ప్రచారమవుతున్న వార్తలలో ఒకటి విజయ్ దేవరకొండ – రష్మిక మండన ప్రేమ వ్యవహారం.వీళ్లిద్దరు కలిసి ‘గీత గోవిందం’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించారు.ఆ సమయం లోనే వీళ్లిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు.ఇక ఈ సినిమా తర్వాత వెంటనే ‘డియర్ కామ్రేడ్’ అనే చిత్రం లో నటించారు, ఈ సినిమా షూటింగ్ సమయం లో వీళ్ళిద్దరూ మరింత చేరువ అయ్యారు.

Rashmika Mandanna
Rashmika Mandanna

అప్పటి నుండి వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నట్టు, డేటింగ్ చేస్తునట్టు, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి.దీనిపై అటు విజయ్ దేవరకొండ, ఇటు రష్మిక మండన స్పందించి అందులో ఎలాంటి నిజం లేదని, మేము కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చారు.కానీ వీళ్లిద్దరు ఆ తర్వాత కూడా వరుసగా ట్రిప్స్ కి వెళ్లడం, ప్రైవేట్ పార్టీలకు వెళ్లడం వంటివి చాలానే జరిగాయి.

Rashmika Mandanna vijay deverakonda

అవన్నీ చూసిన తర్వాత వీళ్లిద్దరి మధ్య కచ్చితంగా ఎదో జరుగుతుంది,విజయ్ దేవరకొండ ఎంతో ప్రేమతో ఇచ్చిన ఉంగరం రష్మిక తొడుగుకుంది అంటూ రీసెంట్ గా ఒక కథనం సోషల్ మీడియా లో ప్రచారం అయ్యింది.అయితే రష్మిక ఈమధ్యనే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ ఇదే ప్రశ్న ని అడగగా ‘బాబోయి..మీరు మరీ అంత క్రేజీ గా ఆలోచించకండి’ అంటూ సమాధానం ఇచ్చింది.

- Advertisement -
vijay deverakonda

దీనితో లేటెస్ట్ గా వీళ్లిద్దరు కలిసి ఉంటున్నారు, డేటింగ్ చేస్తున్నారు అనే వార్తలకు తెరపడినట్టు అయ్యింది.కానీ వీళ్లిద్దరి మీద అభిమానులకు ఇంకా అనుమానమే. ఎందుకంటే ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ కూడా ఇలాగే చెప్పుకుంటూ వచ్చి చివరికీ ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ని పెళ్లాడింది.ఈ జంట కూడా ఎదో ఒక రోజు అలాంటి ట్విస్ట్ ఇస్తుందనే నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here