Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇది కేవలం ఒక పేరు కాదు,ఒక బ్రాండ్.చిరంజీవి మేనల్లుడిగానే ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం అయ్యాడు.తొలి సినిమాలో ఇతని లుక్స్ చూసి, ఇతను హీరో ఎలా అయ్యాడు,చిరంజీవి కుటుంబం అయ్యినంత మాత్రాన ఎవరు పడితే వాళ్ళు హీరో గా వచ్చేస్తారా..?, అని ఇలా చాలా అనుకున్నారు.కానీ అల్లు అర్జున్ తన టాలెంట్ తో తనమీద కామెంట్ చేసిన ప్రతీ ఒక్కరికి చెంప దెబ్బ చాలా బలంగానే కొట్టాడు.ప్రతీ సినిమాకి తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ, కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టైలిష్ స్టార్ గా ఎదిగి నేడు ఐకాన్ స్టార్ గా , పాన్ ఇండియన్ స్టార్ గా , యూత్ ఐకాన్ గా తిరుగులేని స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నాడు.ఆయన సినీ జర్నీ ప్రతీ యంగ్ స్టర్ కి ఒక పాఠం లాంటిది.
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న వారందరూ రాజమౌళి సినిమాల ద్వారా పాన్ ఇండియా మార్కెట్ కి పరిచయం అయ్యారు.కానీ అల్లు అర్జున్ మాత్రం తన సొంత టాలెంట్ తో ‘పుష్ప’ చిత్రం తో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసాడు.ఇప్పుడు ఆయన హీరో గా నటిస్తున్న పుష్ప సినిమా కోసం పాన్ వరల్డ్ ఆడియన్స్ మొత్తం ఎదురు చూస్తున్నారు.అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న విడుదల చేసిన టీజర్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
ముఖ్యంగా ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది, ఇందులో అల్లు అర్జున్ చీర కట్టి మహంకాళి రూపం లో కనిపించడం తో సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యింది.గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ లేడీ గెటప్ వెయ్యడాన్ని ఆయన దురాభిమానులు సోషల్ మీడియా లో ట్రోల్ చెయ్యడానికి ఉపయోగించేవాళ్ళు.కానీ ఇప్పుడు అలాంటి గెటప్ కి నీరాజనాలు పలుకుతున్నారు.అల్లు అర్జున్ సాధించిన సక్సెస్ కి ఇంతకు మించి ఉదాహరణ ఏమి చూపించగలం.భవిష్యత్తులో ఆయన హాలీవుడ్ హీరోలతో కూడా పోటీ పడే రేంజ్ కి ఎదుగుతాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఆయనకీ ఉన్న టాలెంట్ అలాంటిది.