Sharad Kelkar : ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో స్టార్స్ గా కొనసాగుతున్న ఎంతో మంది నటీనటులు ఈరోజు కోట్లాది మంది అభిమానులను సంపాదించారని వాళ్ళేమి ఆకాశం నుండి దిగి వచ్చారనుకోవడానికి వీలులేదు.ఎన్నో కష్టనష్టాలను అనుభవించి మన మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా చూడనటువంటి ఎన్నో కష్టాలను చూసి నేడు ఈ స్తానినికి చేరుకున్నారు..అలాంటి స్థాయి నుండి వచ్చిన వ్యక్తి గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము.అతని పేరు శరద్ కేల్కర్.
మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం లో మెయిన్ విలన్ గా నటించాడు ఈయన.అంతే కాదు ప్రభాస్ హీరో గా నటించిన బాహుబలి చిత్రం హిందీ వెర్షన్ కి ప్రభాస్ కోసం డబ్బింగ్ కూడా చెప్పాడు.రీసెంట్ గా ఈయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన జీవితం లో ఎదురుకున్న ఒడిదుడుకులను గుర్తు చేసుకుంటూ ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘నేను చిన్నతనం లో ఎంతో దుర్భరమైన జీవితాన్ని గడిపాను..నేను ముంబై లోనే బజార్ రోడ్ లో ఉన్న ఒక చిన్న గదిలో నివసించేవాడిని.ఆ చిన్న రూమ్ లో నాతో పాటుగా 8 మంది ఉండేవారు.మేము దీనిని రాజస్థాన్ డాబాగా కూడా ఉపయోగించేవాళ్ళం.నేను గ్యాస్ సిలిండర్లను చూసుకునేవాడిని.అప్పట్లో మేము ఒక్క చపాతీని రెండు రూపాయలకు అమ్ముకొని బ్రతికేవాళ్ళం.అక్కడ పని చేస్తున్న కారణం గా ప్రతీ రోజు నాకు రెండు రోటీలు మరియు నాలుగు గుడ్లు ఆహారంగా పెట్టేవాళ్ళు.అంతే కాకుండా రోజుకి 25 రూపాయిల జీతం కూడా ఇచ్చేవారు.ఏదైనా పెద్ద పని దొరికినప్పుడు మాత్రమే నేను నా మిత్రులతో కలిసి పార్టీ చేసుకునేవాడిని.అలా అప్పట్లో నేను ఒక జిమ్ లో కూడా పనిచేసాను.నెలకు 2750 రూపాయిల జీతం వచ్చేది’ అంటూ ఆయన చిన్నప్పటి నుండి ఎదురైనా తన కష్టాలను చెప్పుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.