Janhvi Kapoor : బాలివుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసే వారికన్నా ప్రేమలు, డేటింగ్ లు చేస్తూ వస్తున్న హీరోయిన్లు ఇప్పుడు చాలా మంది ఉన్నారు..అలానే వార్తల్లో కూడా నిలుస్తున్నారు.. ఆ జాబితాలోకి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా ఉందన్న విషయం తెలిసిందే.. ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. బాయ్ ఫ్రెండ్ తో ట్రిప్ లు వేస్తూ మీడియకు దొరుకుతుంది. అయితే ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. జాన్వీ ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నట్లు వార్త షికారు చేస్తుంది..

ఈ జంట ముంబయిలో జరిగే ప్రైవేట్ పార్టీలు, పంక్షన్స్ కి కూడా కలిసి వెళ్తున్నారు. సందడి చేస్తున్నారు. కలిసి సందడి చేశారు. ఆ మధ్య జాన్వీకపూర్ బర్త్ డేను కూడా సెలబ్రేట్ చేశాడు శిఖర్. ఆరోజు ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శిఖర్ పహారియా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడే. దాంతో వారి మధ్య సంమ్ థింగ్ సంమ్ థింగ్ అని జనాలు ఫిక్స్ అయ్యారు..గత కొంతకాలంగా యంగ్ స్టార్.. బిజినెస్ మాన్.. శిఖర్ పహారియాతో డేటింగ్‌లో ఉందనే వార్తలు ఇండస్ట్రీ అంతా గుప్పుమన్నాయి. శిఖర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ షిండే మనవడు. ఇప్పటికే ఈ ఇద్దరు విహారయాత్రలకు..ప్రేమయాత్రలకు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

వీరిద్దరు తిరుగుడు చూస్తుంటే వారిద్దరి లవ్‌ఎఫైర్ నిజమే అనే వార్తలకు బలం చేకూరినట్లయింది. అందులోను మొన్న శనివారం ముంబయిలో జరిగిన నీతా ముఖేష్ అంబానీ సాంస్కృతిక కేంద్రం ప్రారంభోత్సవ వేడుకలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. జాన్వీకపూర్ తండ్రి బోనీ కపూర్.శిఖర్ పహారియాతో కలిసి ఈ వేడుకకు హాజరుకావడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇక ఇదే ఫంక్షన్ లో ఇద్దరు కలిసి కాసేపు విడిగా కూడా మ మాట్లాడుకున్నారట. దాంతో జాన్వీకపూర్ ప్రేమాకి రెండు వైపులా కుటుంబాల నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిందంటున్నారు సినీ విశ్లేషకులు.. అయితే పెళ్లి ఎప్పుడూ అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.. అయితే వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ వచ్చినా.. పెళ్లి మాత్రం ఇప్పట్లో ఉండదంటూ.. బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో బిజీ బిజీగా ఉంది జాన్వీ కపూర్.. ప్రస్తుతం సౌత్ ఎంట్రీకి రెడీ అయ్యింది. తెలుగులో ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది..ఈ సినిమా హిట్ అయితే జాన్వీ కపూర్ రేంజ్ మారిపోవడం ఖాయం..