Ramya Krishna ఇండస్ట్రీ లో ఒక హీరో మరియు ఒక హీరోయిన్ క్లోజ్ గా కలిసి ఉంటే మీడియా లో రకరకాల వార్తలు జోరుగా ప్రచారమయ్యే సంగతి అందరికీ తెలిసిందే. దశాబ్దాల నుండి ఇది జరుగుతూనే ఉంది,కొంతమంది సెలెబ్రిటీలు ఇలాంటి రూమర్స్ ని అసలు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు పోతారు.కానీ సున్నిత మనస్తత్వం ఉన్న సెలెబ్రిటీలు మాత్రం చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతారు.ముఖ్యంగా టాప్ లీడింగ్ హీరోయిన్స్ విషయం లో అయితే ఇలాంటి రూమర్స్ అనేది సర్వసాధారణం.

అలా ప్రముఖ టాప్ హీరోయిన్ రమ్య కృష్ణ పై ఆరోజుల్లో చాలా రూమర్స్ వచ్చేవట.రమ్య కృష్ణ టాలీవుడ్ మరియు కోలీవుడ్ లలో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది.కానీ ఆమె ఎక్కువగా అక్కినేని నాగార్జున తో నటించింది.వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు సుమారుగా పది సినిమాలకు పైగా వచ్చి ఉంటాయి, వాటిల్లో అధిక శాతం సూపర్ హిట్ సాధించినవే.

ఒకటి రెండు సినిమాలు చేస్తేనే మీడియా సదరు హీరో హీరోయిన్ కి లింక్ పెట్టేసే మీడియా, ఇన్ని సినిమాలు చేస్తే చూస్తూ ఎందుకు ఊరుకుంటుంది.అందులోనూ వీళ్లిద్దరు వ్యక్తిగతం గా కూడా బెస్ట్ ఫ్రెండ్స్.అందుకే అప్పట్లో వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారని,ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారని, త్వరలో నాగార్జున అమలకి విడాకులు ఇచ్చేసి రమ్యకృష్ణ ని పెళ్లాడబోతున్నాడని, ఇలా ఎన్నో వార్తలు వచ్చాయి.

ఇవన్నీ నిజమేనేమో అని అభిమానులు సైతం అనుకునేవారు.ఎందుకంటే ఇప్పట్లో ఉన్నట్టుగా సోషల్ మీడియా అప్పట్లో లేదు, మెయిన్ మీడియా ఏది చెప్తే అదే నమ్మేవారు జనం, అలా ఈ రూమర్ ని కూడా నమ్మేశారు. అయితే రమ్య కృష్ణ 2003 వ సంవత్సరం లో ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ ని పెళ్లాడడం తో రూమర్స్ అన్నిటికీ చెక్ పడింది. అయితే అప్పట్లో వచ్చిన ఈ రూమర్స్ పై అటు నాగార్జున కానీ, ఇటు రమ్య కృష్ణ కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం విశేషం.
