Ashu : బుల్లితెర ఇండస్ట్రీలో యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అషు రెడ్డి.. ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ లో అడుగుపెట్టిన తర్వాత భారీ పాపులారిటీని దక్కించుకుంది. ముఖ్యంగా రాంగోపాల్ వర్మతో ఈమె చేసిన ఇంటర్వ్యూలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. అంతేకాదు మొన్న మధ్య రాంగోపాల్ వర్మ ఈమె కాళ్లు నాకుతూ నోట్లో పెట్టుకోవడం మరింత రచ్చకు దారితీసింది.. అయినా కూడా అషు రెడ్డి కి ఏ మాత్రం ఎక్కడా క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.

ప్రస్తుతం విదేశాలంటూ వెకేషన్ లకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న ఈమె మొన్నమధ్య దుబాయ్లో రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి తెగ సందడి చేసిన విషయం తెలిసిందే. ఈమె ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వెకేషన్కు సంబంధించిన ఫోటోలను లేదా వీడియోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా శ్రీలంకకు వెకేషన్ కు వెళ్లి న ఈమే అక్కడ ఏదో పార్టీలో మెరిసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత క్యాసినో ఆడి ఐదు నిమిషాల్లోనే రూ.1.2 లక్షలు గెలుపొందానని.. ఆ ఆనందాన్ని అభిమానులతో కూడా పంచుకుంది.. అంతేకాదు హెయిర్ స్టైలిస్ట్ రవి కూడా తనతో పాటు అమౌంట్ గెలుచుకున్నాడని తన జీవితంలో అదే మొదటిసారి క్యాసినో ఆడడం అని.. ఆడిన ఐదు నిమిషాల్లోనే తనకు లక్ష ఇరవై వేల రూపాయలు లభించింది అని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది అషు రెడ్డి.
అంతేకాదు బ్లాక్ డ్రెస్ లో థైస్ కనిపించే విధంగా వయ్యారాలు వలకబోస్తూ ఫ్యాషన్ ర్యాంప్ వాక్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే అషూ రెడ్డి శ్రీలంకలో కూడా తన హవా కొనసాగిస్తుందని చెప్పవచ్చు.