Jr NTR సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.. వారి సినిమాల కంటే కూడా వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని.. ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు వారి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన భార్యను ముద్దుగా ఏమని పిలుస్తాడో సోషల్ మీడియాలో రివీల్ చేశాడు. ప్రస్తుతం పోస్ట్ వైరల్ గా మారింది..

జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. నందమూరి వంశంలో ఏంటి రామారావు తర్వాత మళ్లీ అంతటి ఫాలోయింగ్ జూనియర్ ఎన్టీఆర్ సొంతం చేసుకున్నారటంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు.. జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఎక్కువగా సోషల్ మీడియాలో పంచుకోరు కానీ నేడు ఆయన భార్య ప్రణతి పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు తారక్..
ఎన్టీఆర్ సతీమణి ప్రణతి చాలా సింపుల్ గా ఉంటారు. సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా కనిపిస్తుంటుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తప్ప.. ఫ్యామిలీ కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో పంచుకోవడం రేర్. ఇక పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను కూడా అరుదుగా పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా నేడు తన భార్య పుట్టినరోజు సందర్భంగా ప్రణతికి ప్రత్యేకమైన విషెస్ తెలుపుతూ తన ఫోటోని షేర్ చేస్తూ స్పెషల్ బర్త్డే విషెస్ చెప్పారు తారక్
. ఈ ఫోటోలో కపుల్ గా కలిసి ఉన్న క్యూట్ పిక్నిక్ షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే అమ్మలు.. అంటూ ఎల్లో కలర్ లవ్ సింబల్స్ ని ట్యాగ్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్.. ప్రణతిని ముద్దుగా తారక్ అమ్మలు అని పిలుస్తారని రివిల్ చేసేశారు..