Sana Begum: సనా బేగమ్.. టాలీవుడ్ లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. హీరోలకు, హీరోయిన్లకు తల్లిగా, పిన్నిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రలు పోషించింది. ఐదు పదుల వయసులోనూ సనా బేగమ్ అందమైన రూపంతో ఆకట్టుకుంటుంది. టీవీ సీరియల్స్ లోనూ ఈమె రాణిస్తోంది. తాజాగా సనా బేగమ్ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకోగా అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
సనా బేగమ్ అటు సీరియల్స్ లోనే కాకుండా ఇటు వెండి తెరపై సుమారు 600 చిత్రాలకు పైగా నటించింది. ఇటీవల విడుదలైన రంగమార్తాండ చిత్రంలోని విభిన్నమైన పాత్ర పోషించింది. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో సనా బేగమ్ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. నేను యాడ్ చేయడానికి మా కుటుంబం ఎంతగానో సపోర్ట్ చేసిందని తెలిపారు. హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. కాకపోతే పెళ్లయిందని, పిల్లలు ఉన్నారని చెప్పద్దన్నారు. స్విమ్ సూట్ వేసుకోవాలి, ఎక్స్పోజింగ్ చేయాలని చెప్పడంతో ఆ అవకాశాలని రిజెక్ట్ చేశానన్నారు. కన్నడ పరిశ్రమలో కూడా ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని తెలిపారు.
సనా బేగమ్ తన కూతురి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తనకి కూడా చిన్న వయసులోనే పెళ్లి చేయడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందని తెలిపారు. తన కూతురు పెళ్లి కాకముందు చాలా సంతోషంగా ఉందని.. పెళ్లి తరువాత నా కూతురు నరకం అనుభవించింది.vతనని తన భర్త కుటుంబ సభ్యులు దుబాయ్ తీసుకువెళ్లారు. తనని రకరకాలుగా చిత్రహింసలు చేశారు. కనీసం అన్నం కూడా పెట్టకుండా నరకం చూపించారు .కానీ ఇలాంటి విషయాలను ఏవి ఎప్పుడు కూడా నా కూతురు నాకు చెప్పలేదు. కానీ నాకే ఒకసారి అనుమానం వచ్చి ఆరా తీస్తే నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి.
తన డబ్బు, బంగారం మొత్తం వాడుకొని తననే వేధించారని తెలిపింది. తన కూతురు విషయంలో సనా ఎంతగానో బాధపడుతోంది. తన చేతుల మీదగా ఎంతోమంది పెళ్లిళ్లు చేశానని.. కానీ తన కూతురికి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటా అని ఎప్పుడూ బాధపడుతూ ఉంటానని ఆమె అన్నారు. అందుకే ఒక తల్లిగా ఆమెకు అండగా నిలిచి.. అక్కడి నుంచి తీసుకువచ్చాను. తను తప్పు లేదు కాబట్టి ఎవరి ముందు తలదించాల్సిన అవసరం లేదు. నా కూతురు విడాకులు తీసుకుంది. ప్రస్తుతం డిప్రెషన్ లో నుంచి బయటకు వచ్చి యూట్యూబ్ ఛానల్ సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది. అందులో వచ్చిన డబ్బులతో తన ఐదేళ్ల కొడుకుని పోషించుకుంటుంది అంటూ గర్వంగా చెప్పింది.