Ranga Maarthaanda ఈమధ్య కాలం లో చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపేస్తున్నాయి.అతి తక్కువ బడ్జెట్ తో కేవలం కంటెంట్ ని నమ్ముకొని, బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటిన సినిమాలు రీసెంట్ గా ఎన్నో ఉన్నాయి.గత ఏడాది విడుదలైన ‘కాంతారా’ చిత్రం పాన్ ఇండియా రేంజ్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తే , ఈ ఏడాది ‘బలగం’ చిత్రం అలాంటి వసూళ్ల సునామినే సృష్టించింది.
కేవలం 50 లక్షల రూపాయిల గ్రాస్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు 25 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.ఫుల్ రన్ లో మరో పది కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.ఇప్పుడు అలాంటి సెన్సేషన్ రంగమార్తాండ చిత్రం కూడా సృష్టించబోతోందా అంటే అవుననే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
మొదటి రోజు కేవలం 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చేలోపు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడడం కష్టమే అని అందరూ అనుకున్నారు.కానీ రెండవ రోజు కూడా అదే రేంజ్ స్థిరమైన వసూళ్లను రాబట్టి, మూడవ రోజు కూడా అదే ఊపు ని కొనసాగించింది.అలా మూడు రోజులకు కలిపి కోటి 60 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం, బ్రేక్ ఈవెన్ కి ఒక్క అడుగు దూరం లో ఉంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ రెండు కోట్ల 50 లక్షల రూపాయలకు మాత్రమే జరిగిందట.ఈ వీకెండ్ కూడా ఉండడం తో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకుంటుందని ఇప్పటికే అందరికీ అర్థం ఆయ్యింది, మరి బలగం రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం అంటున్నారు విశ్లేషకులు.