Nishka : టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న కన్నుమూసిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారక రత్న గుండెపోటుకు గురయ్యారు..గుండెపోటుకు గురైన ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి బెంగళూరు లో తుది శ్వాస విడిచారు. ఇది నందమూరి ఫ్యామిలీతో పాటు అభిమానులను తీవ్ర విషాదంలో ముంచింది. ఇప్పటికీ చాలామంది తారకరత్న మన మధ్య లేడంటే జీర్ణించుకోలేకపోతున్నారు.. తన భార్యా పిల్లలు మాత్రం తారకరత్న లేడన్న వార్తను విని తట్టుకోలేక పోతున్నారు.. భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు ఎమోషనల్ అవుతు పోస్టు పెడుతూ తన భాధతో అందరిని ఏడ్పించేసింది.. ఇక మొన్నీమధ్య తారకరత్న కూతురు నిష్కా తల్లి బాధను చూడలేక ఒక నోట్ రాసిన సంగతి తెలిసిందే.. అదికాస్త వైరల్ గా మారింది..ఇప్పుడు మరో పోస్ట్ వైరల్ అవుతుంది…

ఇంత చిన్న వయసులో ఆయన తమని విడిచి వెళ్లడాన్ని వారి కుటుంబ సభ్యులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆయన సతీమణి అలేఖ్యా రెడ్డి నిత్యం భర్తతో గడిపిన మధురజ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుని కన్నీరుమున్నీరవుతోంది. ఆమెను ఓదార్చాడం ఎవరి తరం కావడం లేదు. ఆయన్ని మర్చిపోలేక.. తన ఆవేదనను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకుంటోంది. వాలంటైన్స్‌డే రోజున తారకరత్న రాసిన ప్రేమలేఖ, తిరుమలలో ఫ్యామిలీతో కలిసి చివరిసారిగా దిగిన ఫొటోను పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది అలేఖ్య.. అది కూతురును మరింత బాధించింది..
తల్లి బాధపై నిష్కా రాసిన నోట్ అందరిని కంటతడి పెట్టించింది..తల్లీకూతుళ్ల మధ్య అనుబంధానికి ప్రతీకగా ఈ నోట్ నిలుస్తుందంటూ కామెంట్లు అందుకుంది.. ఇప్పుడు నిష్కా మరొక పోస్ట్ పెట్టింది..అది ఇప్పుడు మారోసారి నందమూరి ఫ్యాన్స్ ను కంటతడి పెట్టిస్తుంది..నా ప్రాణం.. నా బలం నా తల్లి దండ్రులే అని పోస్ట్ చేసింది.. దాన్ని చూసిన నెటిజన్లు నిష్కాకు దైర్యం చెబుతున్నారు…తారకరత్న ఆకస్మిక మరణం తో ఆయన భార్య అలేఖ్య ఎంతో బాధ పడుతున్నారు. తమ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. భావోద్వేగానికి లోనవుతోంది అలేఖ్య. వాటిని చూసిన వారికి.. తారకరత్న-అలేఖ్యారెడ్డి మధ్య ఎంత బలైమన బంధం ఉందో.. ఆయన తన భార్యను ఎంతలా ప్రేమించారో అర్థం అవుతుంది. ఆమె పోస్ట్ లు చూసిన తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. అలేఖ్యారెడ్డి త్వరగా ఈ బాధ నుంచి బయటపడాలని అభిమానులు కోరుకుంటున్నారు.