బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో న్యూ లుక్ లో ఆకట్టుకుంటున్న Samantha.. పిక్స్ వైరల్..

- Advertisement -

Samantha ఇటీవల హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే..నాగ చైతన్యతో విడాకుల అనంతరం కూడా సమంత తన లైఫ్ స్టైల్ మార్చుకోలేదు. బోల్డ్ రోల్స్ లో నటించి షాక్ ఇచ్చింది. ఆన్ స్క్రీన్ పక్కన పెడితే ఆఫ్ స్క్రీన్లో ఆమె ధరించిన బట్టలు వివాదాస్పదం అయ్యాయి.. బోల్డ్ ఫోటో షూట్స్ చేసేందుకు సమంత అసలు వెనుకాడదు. ఈ మధ్య సమంత వాటికి దూరంగా ఉంటున్నారు. వ్యక్తిగత సమస్యలు అందుకు కారణం. సమంత మయోసైటిస్ బారిన పడిన విషయం తెలిసిందే. కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టింది. ఇప్పుడు మళ్ళీ సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపొయింది.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Samantha
Samantha

కాగా చాలా గ్యాప్ తర్వాత సమంత గ్లామరస్ ఫోటో షూట్ చేశారు. తన లేటెస్ట్ మూవీ శాకుంతలం ప్రమోషన్స్ భాగంగా ఆమె ఈ షూట్ లో పాల్గొన్నారు. ట్రెండీ వేర్ ధరించిన సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ కాకరేపుతుంది. సమంత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సమంత లుక్ అద్భుతం అంటూ, బ్లాక్ అండ్ వైట్ లో హాట్ డ్రెస్సులో న్యూ లుక్ బాగుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..సమంత అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో బిజీగా ఉన్నారు.

sam

ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో ఆమె పాపులర్ అయ్యారు. ఎక్కువ సమయం అక్కడే గడుపుతున్నారు. ముంబైలో సమంత ఖరీదైన ఇల్లు కొన్నట్లు సమాచారం. ఏకంగా హైదరాబాద్ నుండి మకాం ముంబైకి మార్చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం సమంత సిటాడెల్ షూట్లో పాల్గొంటున్నారు. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేస్తుండగా ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు..ఇకపోతే నైనిటాల్ లో సిటాడెల్ కి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. నెక్స్ట్ షెడ్యూల్ విదేశాల్లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సౌత్ ఆఫ్రికాతో పాటు పలు దేశాల్లో సిటాడెల్ షూట్ జరపనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. అలాగే విజయ్ దేవరకొండకు జంటగా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇక డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది.. మొత్తానికి సమంత ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here