Dasara ‘దసరా’ మూవీ స్టోరీ ఇలా ఉందేంటి..ఆడియన్స్ జీర్ణించుకోగలరా?

- Advertisement -

Dasara : యువ హీరోలలో మంచి క్రేజ్ దక్కించుకున్న న్యాచురల్ స్టార్ నాని తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన చిత్రం దసరా.ఈసారి కొడితే కుంభస్థలం బద్దలు అవ్వాలి, పాన్ ఇండియా రేంజ్ లో నాపేరు మోతమోగిపోవాలి అనే కసితో ఈ సినిమాని చేసాడు.ఇప్పటి వరకు కేవలం ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ మరియు యూత్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన నాని, మొట్టమొదటిసారి ఊర మాస్ రోల్ తో మన ముందుకు రాబోతున్నాడు.

Dasara
Dasara

మార్చి 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ , తమిళం , మలయాళం మరియు కన్నడ బాషలలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని నిన్ననే విడుదల చేసారు. నాని ని సరికొత్త అవతార్ లో ఊర మాస్ గెటప్ లో చూసేసరికి ఫ్యాన్స్ కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ సినిమా సంబంధించిన స్టోరీ సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది.

Nani keerthy suresh

ఇక ఈ స్టోరీ వివరాల్లోకి వెళ్తే నాని కి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె పాత్ర పేరు ‘వెన్నెల’. అయితే ఈ సినిమాలో హీరోకి ఇద్దరు స్నేహితులు ఉంటారు. వీళ్ళ ముగ్గురు కూడా ఒకరికి తెలియకుండా ఒకరు ‘వెన్నెల’ ని ప్రేమిస్తారు. వెన్నెల హీరోని కాకుండా అతని స్నేహితుడితో ప్రేమలో పడుతుంది. ఈ విషయం తెలుసుకున్న హీరో చాలా దిగ్బ్రాంతికి గురి అవుతాడు,కానీ తన ప్రాణ స్నేహితుడే అవ్వడం తో తన ప్రేమని త్యాగం చేసేస్తాడు.

- Advertisement -
Dasara movie

కానీ హీరోకి ఉండే మరో స్నేహితుడు తనని కాకుండా తన తోటి స్నేహితుడిని ప్రేమించిందని అతని పై పగ పెంచుకుంటాడు. విలన్ తో చేతులు కలిపి తన స్నేహితుడిని చంపించేస్తాడు. ఆ తర్వాత హీరో తన స్నేహితుడిని చంపిన వాళ్ళందరి మీద పగ తీర్చుకుంటాడట. ఇదే మూవీ స్టోరీ,ఈ చిత్రాన్ని సరైన ఎమోషనల్ కనెక్ట్ తీస్తే మాత్రం నాని చెప్పినట్టు గానే పాన్ ఇండియా రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని దున్నేస్తాది. కానీ కాస్త అటు ఇటు అయినా కూడా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిపోతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Natural Star Nani
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here