Rajeev Kanakala : ఇండస్ట్రీ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్న నటులలలో ఒకడు రాజీవ్ కనకాల.ఈయన ప్రముఖ టీవీ యాంకర్ సుమ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే.వీళ్లిద్దరు కలిసి గతం లో ఒక సీరియల్ లో నటించారు.ఆ సమయం లోనే వీళ్ళ మధ్య ప్రేమ పుట్టి పెళ్లి చేసుకున్నారు. సుమ బుల్లితెర మీద బిజీ యాంకర్ గా ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిందో అందరికీ తెలిసిందే. సుమారుగా రెండు దశాబ్దాల నుండి బుల్లితెర మీద అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ని పంచుతూ దూసుకొస్తోంది.
అంతే కాదు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో చిన్న హీరో దగ్గర నుండి స్టార్ హీరో వరకు ప్రతీ ఒక్కరికీ సమయే యాంకర్ గా కావలి, ఈ రెండు దశాబ్దాలలో ఎంతో మంది యాంకర్స్ ఇండస్ట్రీ కి వచ్చారు. కానీ సుమా కి వచ్చినంత క్రేజ్ లో , పావు శాతం కూడా సంపాదించలేకపొయ్యారు.ఒక్క మాటలో చెప్పాలంటే మొగుడు రాజీవ్ కనకాల కంటే కూడా సుమ సంపాదన మూడు రెట్లు ఎక్కువ ఉంటుంది.
![Rajeev Kanakala](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/03/sumo2.jpg)
సాధారణంగా భర్త కంటే భార్య సంపాదన ఎక్కువ అని విభేదాలు వచ్చి విడిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ జంట మాత్రం ఇన్నేళ్లు దాంపత్య జీవితం దిగ్విజయం పూర్తి చేసుకొని ముందుకొచ్చారు. అయితే గత కొంతకాలం క్రితం వీళ్లిద్దరు విడిపోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియా లో రావడం కలకలం రేపింది.అందుకు కారణం సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో ఎక్కువగా కనిపించే ఒక హీరోయిన్ తో రాజీవ్ కనకాల ఎక్కువ తిరుగుతున్నట్టు సుమకి తెలిసిందని.
![Rajeev Kanakala suma](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/03/sumo3-1024x768.webp)
ఈ విషయం మీదనే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏర్పడి విడాకులు వరకు వెళ్లిందని, కానీ పెద్దలు వీళ్లిద్దరి మధ్య ఉన్న ఆ గొడవలను సర్ది విడాకులు జరగకుండా చేసారని ఇలా పలు రకాల వార్తలు వచ్చాయి, ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య గొడవలన్నీ సర్దుకున్నాయని. ఇద్దరు మళ్ళీ కలిసిమెలిసి ఎంతో సంతోషం గా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.
![Rajeev Kanakala anchor suma](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/03/sumo4-1024x768.webp)