Shruti Haasan : చీరకట్టులో శ్రుతి హాసన్ వయ్యారాలు.. ట్రెడిషనల్ లుక్ లోనూ హాట్ నెస్ ఓవర్ లోడెడ్

- Advertisement -

Shruti Haasan .. సంక్రాంతి బరిలో రెండు సూపర్ హిట్ సినిమాలతో దిగి బంపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ లు ఇచ్చిన హీరోయిన్. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ బ్యూటీ హవా నడుస్తోందని చెప్పొచ్చు. పాన్ ఇండియా సినిమాల్లోనూ ఈ భామ త్వరలోనే సందడి చేయనుంది.

Shruti Haasan
Shruti haasan

ఓవైపు సినిమాలు.. ఇంకోవైపు సింగింగ్.. మరోవైపు మ్యూజిక్ కంపోజింగ్.. ఇలా చేతినిండా పనిలో బిజీగా ఉన్నా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ ఉంటుంది. తీరిక లేకపోయినా.. వారి కోసమే ప్రత్యేకంగా ఫొటోషూట్స్ చేసి కొత్తకొత్త ఫొటోలు అప్డేట్ చేస్తూ ఉంటుంది.

Shruti Haasan Saree Photos

365 రోజులు థియేటర్ లో తాను సందడి చేయలేకపోయినా.. నిత్యం సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది శ్రుతి. తాజాగా ఈ భామ తన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఆ ఫొటోలు చూసి కుర్రాళ్ల మతిపోయిందనుకోండి. 

- Advertisement -
Shruti Haasan Saree Stills

చీరకట్టులో శ్రుతి హాసన్ దేవకన్యలా కనిపించింది. అచ్చమైన తెలుగుండి ఆడపడుచులా నిండైన కట్టుతో.. అంతకుమించి నిండైన బొట్టుతో.. కళ్లకు కాటుక అద్దుకుని.. బాపూబొమ్మలా కనిపించింది. ప్రస్తుతం శ్రుతి హాసన్ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Shruti Haasan Latest Photos

ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు శ్రుతిపై మనసు పారేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ వెస్టర్న్ లుక్ లోనే అదరగొట్టిన శ్రుతి ఇప్పుడు ట్రెడిషనల్ లుక్ లోనూ తనకు ఎవరూ సాటికాదని ప్రూవ్ చేస్తోందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. సిల్క్ చీరలో శ్రుతి చాలా ముద్దుగా ఉందంటూ కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రుతి ట్రెడిషనల్ ఫొటోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.

Shruti Haasan New Stills

ఇక శ్రుతి హాసన్ సినిమాల విషయానికి వస్తే సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాలతో సందడి చేసింది. ప్రస్తుతం శ్రుతి ప్రభాస్ సరసన సలార్ లో నటిస్తోంది. ఈ సినిమాతో శ్రుతికి కూడా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here