Womens day : వెండి తెరను ఏలిన మహిళా డైరెక్టర్లు వీళ్లే..

- Advertisement -

Womens day : ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అది డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది.. అది హిట్ అయినా ప్లాప్ అయినా కూడా దాని బాధ్యత మొత్తం డైరెక్టర్ దే.. 24 క్రాప్టులను సమన్వయపరుస్తూ సినిమాను రూపొందించాలంటే ఎన్నో సవాళ్లు ఉంటాయి. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే దర్శకత్వ విభాగంలోనూ తొలితరం నుంచే తమదైన ముద్ర వేశారు మహిళా దర్శకులు..కొంతమంది మహిళలు మొదట నటిగా పరిచయం అయినా ఆ తర్వాత సక్సెస్ఫుల్ డైరెక్టర్లు అయ్యారు.. ఉమేన్స్ డే స్పెషల్ గా తెలుగులో టాప్ ఉమెన్ డైరెక్టర్లు వారి సినిమాల గురించి తెలుసుకుందాం..

సావిత్రి..

Womens day
Womens day

సినిమాల్లో హీరోయిన్ గా నటించి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంది..హీరోయిన్‌గా కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే చిన్నారి పాపలు, మాతృ దేవత, వింత సంసారం వంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించి సత్తా చాటారు..

- Advertisement -

విజయ నిర్మల..

vijaya nirmala

విజయనిర్మల తన ఏడో ఏటనే ‘మత్స్యరేఖ’అనే సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన ఆమె.. సూపర్ స్టార్ కృష్ణతోనే ఏకంగా 47 సినిమాల్లో నటించారు. 1971లో ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన విజయనిర్మల మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు వంటి ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. దర్శకురాలిగా 44 సినిమాలకు తెరకెక్కించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు..

నందినీ రెడ్డి..

nandhini reddy

అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా మారింది నందినీ రెడ్డి. తొలి సినిమాతోనే ఆమె డైరెక్షన్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత జబర్ధస్థ్‌, కల్యాణ వైభోగమే వంటి చిత్రాలు తెరకెక్కించింది. సమంతతో తీసిన ఓ బేబీ సినిమా దర్శకురాలిగా నందినీరెడ్డిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం సంతోష్‌ శోభన్‌ హీరోగా అన్నీ మంచి శకునములే అనే సినిమాను తెరకేక్కిస్తున్నారు..

జీవితా రాజశేఖర్‌..

jeevitha rajashekar

జీవితా రాజశేఖర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన జానకి రాముడు, ఆహుతి, అంకుశం వంటి ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించారు. 1990లో డా.రాజశేఖర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత నటనకు దూరమైన ఆమె శేషు సినిమాతో దర్శకురాలిగా మారారు. ఆ తర్వాత సత్యమేవజయతే, మహంకాళి, శేఖర్ వంటి సినిమాలను రూపొందించారు. తాజాగా 33 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి నటిగా మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు.. వీళ్లే కాదు చాలా మంది ఉన్నారు.. ఇలా అన్నీ రంగాల్లో రానిస్తున్న మహిళలకు womens day శుభాకాంక్షలు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here