మన Tollywood లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు చాలా ఉన్నాయి..వాటిల్లో హిట్స్ అయినవి ఉన్నాయి, ఫ్లాప్స్ అయ్యినవి ఉన్నాయి, అలాగే అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.అయితే అసలు బడ్జెట్ అనేదే లేకుండా తెరకెక్కిన సినిమా కూడా ఒకటి ఉందని, ఆ సినిమాని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడనే విషయం మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు..
అలా జీరో బడ్జెట్ తో రామ్ గోపాల్ వర్మ తీసిన ‘దొంగల ముఠా’ అనే సినిమా గురించే ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. చేసే ప్రతీ పని చాలా క్రేజీగా ఉండాలనుకుంటారు రామ్ గోపాల్ వర్మ. అప్పట్లో ఈయన తెరకెక్కించిన సినిమాలు ఇండస్ట్రీ స్థితి గతులను మార్చేశాయి. టెక్నికల్ గా షాట్ మేకింగ్ లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి ఒక టెక్స్ట్ బుక్ లాంటోడు రామ్ గోపాల్ వర్మ.
ఆ తర్వాత కూడా ఎన్నో ప్రయోగాలు చేసాడు కానీ సక్సెస్ కాలేదు. కానీ ఈ ‘దొంగల ముఠా’ సినిమా కోసం చేసిన ప్రయోగం మాత్రం సక్సెస్ అయ్యింది. రవితేజ అప్పుడే మిరపకాయ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి ఊపు మీదున్నాడు.ఆయనని హీరో గా పెట్టి, ఛార్మి ని హీరోయిన్ గా పెట్టి, మంచు లక్ష్మీ, బ్రహ్మాజీ, అలీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కోసం అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యలేదు. ఆర్టిస్టులు కూడా ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు.
సినిమాని తియ్యడానికి అవసరమైన కెమెరాలు, లైట్లు , మోనిటర్లు కూడా తన దగ్గర ఉన్న వాటినే వాడాడు రామ్ గోపాల్ వర్మ. కేవలం నాలుగు రోజుల్లోనే సినిమాని పూర్తి చేసాడు. అలా జీరో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో రెండు కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టింది. వీటితో పాటు సాటిలైట్ రైట్స్ , డిజిటల్ రైట్స్ వగైరా వంటివి కలుపుకొని ఈ సినిమాకి పది కోట్ల రూపాయిల వరకు బిజినెస్ చేసింది. బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బులను అందరూ పంచుకున్నారు. అలా రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వింత ప్రయోగం సక్సెస్ అయ్యింది.