Trivikram Srinivas : పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీ లో ఉండే స్నేహితుల సంఖ్య చాలా తక్కువ.ఆయన తన మనసు విప్పి మాట్లాడుకునేంత మంచి సాన్నిహిత్యం కేవలం ఇద్దరు ముగ్గురు తో మాత్రమే ఉండేది.ఆ ఇద్దరు ముగ్గురు లో ఒకరు కమెడియన్ అలీ.పవన్ కళ్యాణ్ తన మొదటి సినిమా నుండి కాటంరాయుడు వరకు అలీ లేనిదే సినిమాలు చేసేవాడు కాదు. వీళ్ళ మధ్య అంత గొప్ప స్నేహం ఉండేది,కానీ ఈ స్నేహితుల మధ్య రాజకీయం చిచ్చు పెట్టింది.

అలీ జనసేన పార్టీ ని కాదని వైసీపీ పార్టీలో చేరడమే అందుకు కారణమనే విషయం అందరికీ తెలిసి.వీళ్లిద్దరు పరస్పరం విమర్శలు కూడా చేసుకొన్నారు,అయితే రాజకీయ విమర్శలు పక్కన పెడితే వ్యక్తిగతంగా మేమిద్దరం మంచి స్నేహితులమే అని, పవన్ కళ్యాణ్ తో కలిసి త్వరలోనే సినిమాలు చెయ్యబోతున్నాని అలీ ఎన్నో సందర్భాలలో ఇంటర్వ్యూస్ ద్వారా తెలియజేసాడు.అయితే ఇప్పుడు ఒక వార్త గత రెండు రోజుల నుండి సోషల్ మీడియా ని ఊపేస్తోంది.

అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో కలిసి తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా సీతం’ రీమేక్ లో నటిస్తున్నాడు. గత కొద్దీ రోజుల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా లో కాస్టింగ్ మొత్తాన్ని డైరెక్టర్ సముద్ర ఖనినే చూసుకున్నాడు.ఒక కీలకమైన పాత్ర కోసం కమెడియన్ అలీ ని కూడా ఆయన ఎంచుకున్నాడు.

అయితే ఫైనల్ కాస్టింగ్ వివరాలను చూసిన ఆ చిత్ర సహా నిర్మాత త్రివిక్రమ్ శ్రీనివాస్ అలీ ని తప్పించి బ్రహ్మానందం ని తీసుకున్నాడట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది. పవన్ కళ్యాణ్ కచ్చితంగా తనతో ఇక కంఫర్ట్ ఫీల్ అవ్వదనే భావనతోనే త్రివిక్రమ్ ఆ పని చేసినట్టు తెలుస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. రెండు నెలల్లో సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి ఆగష్టు 11 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.