Samantha : చైతూ బంగారం రా.. తప్పంతా సమంతదే.. ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చిన సామ్..

- Advertisement -

Samantha : సమంత నాగచైతన్య తొలిసారి నటించిన సినిమా ఏ మాయ చేసావే.. గౌతమ్ మీనన్ దర్శకత్వ వహించిన ఈ సినిమాతోనే సమంత తెలుగు తెరకు పరిచయం అయింది.. మొదటి సినిమాలతోనే జెస్సిగా అలరించి కుర్రాళ్ల మనసు దోచుకుంది సామ్.. ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది.. తెరపైనే కాదు ఆఫ్ స్క్రీన్ లోను చైతు సమంత జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు..

samantha
samantha

ఏ మాయ చేసావే సినిమా సెట్స్ లోనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి 2017లో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. కానీ వారి వ్యక్తిగత కారణాలతో 2 అక్టోబర్ 2021న విడిపోతున్నట్లు అందరికీ చెబుతూ షాక్ ఇచ్చారు.. టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీళ్ళిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారనేది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగాని మిగిలిపోయింది..

తాజాగా ఏ మాయ చేసావే సినిమా వచ్చి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ సినిమాలో సమంతతో దిగిన ఓ ఫోటోను నాగచైతన్య తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. సెలెబ్రేటింగ్ 13 ఇయర్స్ అంటూ పోస్ట్ చేశారు. సమంత కూడా ఏమయా చేసావే 13 ఏళ్లు అంటూ పలు ఫోటోలను షేర్ చేసినా అందులో కేవలం తన ఫోటోలు మాత్రమే ఉండటం ఆశ్చర్యకరం. సమంత షేర్ చేసిన అన్ని ఫోటోలలో కూడా ఒక్క ఫోటో లో కూడా నాగచైతన్య కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది. కానీ నాగచైతన్య మాత్రం సమంతతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేశాడు. దాంతో సోషల్ మీడియాలో రకరకాల వార్త గణాలు గొప్ప మంటున్నాయి..

- Advertisement -

విడాకుల తీసుకున్న తర్వాత చైతు సమంత ప్రవర్తనలు మాత్రం వింతగా ఉన్నాయి. చైతు అంటే విపరీతమైన ద్వేషం, కోపం ఉన్నట్టుగా సమంత పరోక్షంగా చెప్పకనే చెప్పేస్తుంది. కానీ సమంత గురించి మాత్రం నాగచైతన్య ప్రేమగానే చెబుతూ వచ్చాడు ఇప్పటివరకు.. నాగచైతన్య మీరిద్దరూ కలిసి మళ్ళీ నటిస్తారా అని అడగగా.. అది జరిగితే నిజంగానే క్రేజీగా ఉంటుందని తెలిపారు.

అదే సమంతా దగ్గర నాగ చైతన్య గురించి ప్రశ్నిస్తే మాత్రం వెంటనే సీరియస్ అన్నట్టుగా లుక్ ఇచ్చేస్తుంది. కరణ్ జోహార్ ఏదో మాటల్లో నీ భర్త అని అంటే.. నా భర్త కాదు మాజీ భర్త అని కౌంటర్ వేసింది. అంతేకాకుండా ఇద్దరినీ ఒకే గదిలో పెడితే దగ్గర్లో కత్తులు లాంటివి లేకుండా చూసుకుంటే బెటర్ అని అనేసింది.. అంటే ఇద్దరి మధ్య పొడుచుకుని చంపేంత కోపం ఉందా అని అనుమానం కలిగించేలా సమంత మాటలు ఉన్నాయి. ఇక తాజాగా ఏ మాయ చేసావే పోస్టర్లో కూడా సమంత నాగచైతన్య కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది. చైతు మాత్రం సమంతతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేశాడు. దీనిని బట్టి చూస్తుంటే సమంతకి చేతికి ఉన్న తేడా ఏంటో అర్థమవుతుంది.

సమంత ఎంత కోపం ఉందో ఈ విషయంతోనే తెలిసిపోతుంది. చైతుతో ఉన్న పోస్టర్ను సైతం సమంత షేర్ చేసేందుకు ఇష్టపడటం లేదనిపిస్తోంది. ఇద్దరి మధ్య ఎన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నా కూడా అవి బయటకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది అని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో నాగచైతన్య బంగారం రా అంటూ అక్కినేని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక సమంత గురించి మీరే ఆలోచించుకోండి అనే విధంగా కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here